పైర‌సీపై నోడల్ అధికారుల డైరెక్ట్ ఎటాకింగ్!

పైర‌సీ పై కేంద్ర ప్ర‌భుత్వం శ‌మ‌ర‌ఖంఖం పూరించిన సంగ‌తి తెలిసిందే. పైర‌సీ ముఠాని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాల‌తో కంఠిన ఆంక్ష‌ల‌కు రెడీ అయింది.

Update: 2023-11-04 05:48 GMT

పైర‌సీ పై కేంద్ర ప్ర‌భుత్వం శ‌మ‌ర‌ఖంఖం పూరించిన సంగ‌తి తెలిసిందే. పైర‌సీ ముఠాని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాల‌తో కంఠిన ఆంక్ష‌ల‌కు రెడీ అయింది. దీనిలో భాగంగా తాజాగా 12 మంద నోడ‌ల్ అధికారుల్ని కేంద్రం నియ‌మించింది. దీంతో పైర‌సీకి వ్య‌తిరేకంగా మ‌రో ముందు అడుగు ప‌డిన‌ట్లు అయింది. ఇప్ప‌టివ‌ర‌కూ కాపీరైట్ చట్టం చట్టపరమైన చర్యలు తప్ప పైరేటెడ్ ఫిల్మ్ కంటెంట్‌పై నేరుగా చర్య తీసుకునే అవ‌కాశం లేకుండా పోయింది.

అయితే తాజా చ‌ర్య‌ల‌తో పైర‌సీ కంటెంట్ పై ఫిర్యాదులు తీసుకుని డిజిట‌ల్ ప్లాట్ ఫాంల నుంచి కంటెంట్ తొల‌గించే అధికారం నోడల్ అధికారుల‌కు క‌ల్పించింది. సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్ట ప్ర‌కారం పైర‌సీదారుల‌కు మూడు నెల‌ల నుంచి మూడేళ్ల శిక్ష ..3 ల‌క్ష‌లు జ‌రిమానా లేదా సినిమా వ్య‌యంలో ఐదు శాంతం జ‌రిమానా విధించనుంది. పైర‌సీ కారణంగా ఏటా 25 వేల కోట్లు వ‌ర‌కూ న‌ష్టం వాటిల్లితుంద‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

కొత్త చట్టం ప్రకారం నోడల్ ఆఫీసర్ నుండి ఆదేశాలు అందుకున్న తర్వాత 48 గంటల వ్యవధిలో పైరేటెడ్ కంటెంట్‌ను హోస్ట్ చేసే ఇంటర్నెట్ లింక్‌లను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తొలగించవలసి ఉంటుంది. డిజిటల్ పైరసీతో సహా ఫిల్మ్ పైరసీకి వ్యతిరేకంగా నిబంధనలను చేర్చడానికి 40 సంవత్సరాల తర్వాత చట్టం లో స‌వ‌ర‌ణ‌ల‌కు తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది. తాజా చ‌ర్య‌ల‌తో పైర‌సీ దొంగ‌ల‌కు క‌ళ్లెం ప‌డిన‌ట్లేన‌ని తెలుస్తోంది.

ఇటీవ‌లే ఐబొమ్మ షాడో లాంటి మ‌రో సైట్ ఏకంగా నిర్మాత‌ల‌కే వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నేరుగా హెచ్చరిక జారీ చేస్తూ ఓ నోట్ నే రిలీజ్ చేసింది. ఐ బొమ్మ మీద ఫోక‌స్ చేస్తే మేం ఎక్క‌డ దెబ్బ కొట్టాలో అక్క‌డ కొడ‌తాం. పంపిణీదారుడి చేతికి ప్రింట్ వ‌చ్చిన వెంట‌నే ఏమీ తెలియ‌న‌ట్లు! కెమెరా ప్రింట్స్‌ తీసినవాళ్లపై కాకుండా ఓటీటీ రెవెన్యూ కోసం మాపై ఫోకస్‌ పెడుతున్నారు.

ప‌రిశ్ర‌మ‌కు-మాకు జ‌రిగే యుద్దంలో మ‌రో హీరో బ‌లికావ‌డం ఇష్టంలేదు. ఐ బొమ్మ మీద కాకుండా కెమెరా ప్రింట్స్ విడుద‌ల చేస్తున్న వారిపై పైర‌సీ సైట్ ల‌పై దృష్టి పెట్టండి. మేము దేనికి త‌లొగ్గం అంటూ హెచ్చ‌రిక లేఖ‌లో ఉంది. మ‌రి నోడ‌ల్ అధికారుల ఎంట్రీతో ఎటాకింగ్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News