ఈ ఫోటోలో ఉన్న ఐటం బాంబ్‌ ని గుర్తు పట్టారా..?

నెట్టింట ఈమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతూనే ఉంటాయి. ప్రతి రోజు ఈమె సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా ఉంటుంది.

Update: 2024-09-12 13:30 GMT

సినిమాల్లో నటించే స్టార్‌ హీరోయిన్స్ మొదలుకుని బుల్లి తెరపై కనిపించే ముద్దుగుమ్మల వరకు సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ లో తమ అందాల ఫోటో షూట్స్ ను షేర్‌ చేయడం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. నెట్టింట హీరోయిన్స్ అందాల ఆరబోత ఫోటోలు ఒకరికి మించి ఒకరివి ఉన్నాయి అనిపించే విధంగా అందంగా ఉంటారు. తాజాగా ఒక బాలీవుడ్‌ స్టార్ తన పాత ఫోటోను షేర్‌ చేసింది. 15 ఏళ్ల క్రితం నేను నా స్కూల్‌ ఫ్రెండ్స్ తో ఇలా ఒక ఈవెంట్ లో పాల్గొన్నాను అంటూ పాత ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుని, అందులో తనను కనిపెట్టమని పోస్ట్‌ పెట్టింది.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న బాలీవుడ్‌ నటిని మీరు గుర్తించగలరా... ఈమె తెలుగు సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్‌ తో ఒక సినిమాలో, ప్రభాస్ తో మరో సినిమాలో ఐటెం సాంగ్‌ చేసి సౌత్‌ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ మధ్య కాలంలో పూర్తిగా బాలీవుడ్‌ కే పరిమితం అయింది. ఈమె హీరోయిన్‌ గా చేసిన సినిమాల కంటే ఎక్కువగా ఐటం సాంగ్స్ చేయడం వల్ల గుర్తింపు దక్కింది. నెట్టింట ఈమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతూనే ఉంటాయి. ప్రతి రోజు ఈమె సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా ఉంటుంది.

ఇప్పటికే ఈమె ఎవరో గుర్తు పట్టి ఉంటారు.. ఔను ప్రభాస్‌ బాహుబలి సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన నోరా ఫతేహి. ఈమె ఎన్టీఆర్‌ తో కలిసి టెంపర్ లో ఒక ఐటెం సాంగ్ లో ఆడి పాడింది. తన 17 ఏళ్ల వయసులో ఇలా ఒక స్కూల్‌ ఈవెంట్ లో స్నేహితులతో కలిసి స్టేజ్ షో చేసింది. ఆ సమయంలో తీసుకున్న ఫోటో ఇది అంటూ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంది. అప్పటికి ఇప్పటికి నోరా ఫతేహీ లో చాలా మార్పు కనిపిస్తుంది. ఎడమ వైపు మొదటి అమ్మాయి నోరా ఫతేహీ. చాలా తక్కువ సమయంలో ఇండియన్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న నోరా ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ బ్యూటీగా వరుస సినిమాలు చేస్తోంది.

సోషల్ మీడియాలో తన స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడం ద్వారా నోరా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వయసులోనే నోరా చాలా అందంగా ఉందని, ఇప్పుడు ఆ అందం మరింత పెరిగింది అంటూ నెటిజన్స్ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది నోరా ను గుర్తు పట్టనంత మారి పోయావు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే, నిన్ను అభిమానించే వారికి ఇది మంచి కానుక అన్నట్లుగా థ్రూ బ్యాక్ ఫోటో కి కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో పాత ఫోటోతో నోరా ఫతేహీ వైరల్‌ అవుతోంది.

Tags:    

Similar News