ఆ హీరోను ఇమిటేట్ చేసిన ఎన్టీఆర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ తాజాగా దేవర సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Update: 2024-10-01 11:25 GMT

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ తాజాగా దేవర సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. లాంగ్ రన్‌ లో ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు చేయడం ఖాయం అంటూ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమాకు సంబంధించిన వసూళ్లు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేవర హిందీ వర్షన్ ప్రమోషన్ లో భాగంగా కపిల్‌ శర్మ టాక్ షో లో ఎన్టీఆర్‌ పాల్గొన్నాడు. ఆ టాక్ షో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దేవర సినిమా కోసం మేకర్స్‌ భారీ ఎత్తున చేసిన ప్రమోషన్స్ నిర్వహించారు. అందులో భాగంగా కపిల్‌ శర్మ టాక్‌ షో లో పాల్గొన్నడం జరిగింది. ఎన్టీఆర్‌ తో పాటు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ లు పాల్గొన్నారు. వీరు కపిల్‌ శర్మ టాక్ షో లో చేసిన సందడి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఒక టాస్క్ లో భాగంగా సల్మాన్‌ ఖాన్‌ ను ఇమిటేట్ చేసిన వీడియోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ లో తెగ వైరల్‌ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్‌ ను ఎన్టీఆర్‌ అనుకరించిన వెంటనే సైఫ్ అలీ ఖాన్‌ దాన్నిగుర్తించి చెప్పడం అక్కడ ఉన్న వారు అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎన్టీఆర్‌ గొప్ప నటుడు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఎన్టీఆర్‌ ఇతర హీరోను ఇమిటేట్‌ చేయడం అనేది కచ్చితంగా ఇదే మొదటి సారి అయి ఉంటుంది. అది కూడా బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్ ను ఇమిటేట్‌ చేయడం ద్వారా అందరి చూపు అటువైపు ఉంది. ఎన్టీఆర్‌ ఆ షో లో చేసిన హడావుడికి ప్రస్తుతం షో ప్రేక్షకులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ లో ఈ షో స్ట్రీమింగ్‌ అవుతోంది. సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవ్వడం లో ఈ టాక్ షో కీలక పాత్ర పోషిస్తుంది అంటూ బాలీవుడ్‌ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేవర సినిమాతో రికార్డ్‌ బ్రేకింగ్‌ ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ఎన్టీఆర్‌ త్వరలోనే వార్ 2 తో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నాడు. తెలుగు లోనూ ఆ సినిమా డబ్‌ అవ్వబోతుంది. వార్‌ 2 కోసం తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు కేజీఎఫ్‌, సలార్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయి. వచ్చే ఏడాదిలో ఎన్టీఆర్‌ నీల్‌ కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. 2026 లో ఆ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News