దేవర దూకుడికి ఫ్యాన్స్ ఫిదా..!

ఇక ఈ సినిమా తర్వాత ఓ పక్క బాలీవుడ్ లో చేస్తున్న వార్ 2 కోసం కూడా తారక్ డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడు.

Update: 2024-08-31 06:15 GMT

దేవర సినిమాతో తన ఫ్యాన్స్ అందరినీ కాలర్ ఎగరేసుకునేలా చేస్తానని చెప్పిన ఎన్టీఆర్ దాని కోసమే సినిమా మీద పూర్తి ఫోకస్ చేస్తున్నాడు. కొరటాల శివ కూడా సినిమా ఎక్కడ టార్గెట్ మిస్ అవ్వకుండా ఉండేల చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ అంతా దేవర మీద అంచనాలను పెంచుతూ వచ్చింది. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న దేవర మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమా తర్వాత ఓ పక్క బాలీవుడ్ లో చేస్తున్న వార్ 2 కోసం కూడా తారక్ డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడు.

ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ తో సినిమాకు ఈమధ్యనే ముహూర్తం పెట్టుకున్న ఎన్టీఆర్ అక్టోబర్ నుంచి ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ మిగతా టీం తో షూటింగ్ మొదలు పెడితే డిసెంబర్ లో ఎన్ టీ ఆర్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.

కె.జి.ఎఫ్ రెండు భాగాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ లాస్ట్ ఇయర్ ప్రభాస్ తో సలార్ 1 తో కూడా సూపర్ హిట్ కొట్టాడు. ఐతే సలార్ 2 కి కాస్త టైం తీసుకుని ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఐతే తారక్ తో చేసే సినిమా కూడా రెండు భాగాలు ఉంటుందని ఒక టాక్ వినిపిస్తుంది. దేవర కూడా రెండో భాగం ఉంది. సో ఎన్ టీ ఆర్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాల కోసం రెస్ట్ లేకుండా కష్టడుతున్నాడు.

ఈ సెప్టెంబర్ కి దేవర 1 వస్తుండగా.. నెక్స్ట్ ఇయర్ వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా కూడా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత దేవర 2 సినిమా చేసే షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ దేవర లో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే ప్రశాంత్ నీల్ సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న తారక్ ఇక మీదట తన ప్రతి సినిమా ఆ రేంజ్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దేవర 1 రిలీజ్ ప్లానింగ్ కూడా గ్లోబల్ వైడ్ గా భారీగా ఉంటుందని తెలుస్తుంది.

Tags:    

Similar News