వైరల్ వీడియో - తార‌క్ పై అభిమానంతో తెలుగు నేర్చుకున్న జ‌పాన్ బ్యూటీ!

కానీ ఈసారి కాస్త భిన్నంగా ఒక అభిమాని ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసాక తెలుగు నేర్చుకున్న‌ట్లు చెప్ప‌డం నాకెంతో సంతోషాన్నిచ్చింది.;

Update: 2025-03-27 12:15 GMT
వైరల్ వీడియో  - తార‌క్ పై అభిమానంతో తెలుగు నేర్చుకున్న జ‌పాన్ బ్యూటీ!

'దేవ‌ర‌' జ‌పాన్ లో రిలీజ్ సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌తీస‌మేతంగా ఆ దేశం వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చారం లో భాగంగా తార‌క్ జ‌పాన్ కి వెళ్లాల్సి వ‌చ్చింది. అయితే ఈసారి జ‌పాన్ ట్రిప్ తార‌క్ కి ఓ గొప్ప జ్ఞాప‌కంగా మిగిలిపోయింది. దీనికి సంబంధించి తార‌క్ ఓ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేసారు. 'జ‌పాన్ వెళ్లిన ప్ర‌తీసారి నాకు బ్యూటీఫుల్ మెమోరీస్ ల‌భిస్తాయి. కానీ ఈసారి కాస్త భిన్నంగా ఒక అభిమాని ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసాక తెలుగు నేర్చుకున్న‌ట్లు చెప్ప‌డం నాకెంతో సంతోషాన్నిచ్చింది.

సంస్కృతుల మ‌ధ్య వార‌ధిగా ఉన్న సినిమా, భాష‌ను నేర్చుకునేలా చేయ‌డాన్ని సినిమా, భాషా ప్రేమికుడిగా నేను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను' అన్నారు. నిజంగా తార‌క్ కి ఈ ట్రిప్ గొప్ప జ్ఞాప‌క‌మ‌నే చెప్పాలి. అభిమాన హీరో కోసం జ‌పాన్ అభిమాని తెలుగు నేర్చుకున్నారు? అంటే ఓ తెలుగు వాడిగా తార‌క్ ఎంతో గ‌ర్వ‌ప‌డాలి. త‌న మీద ప్ర‌త్యేక‌మైన అభిమానంతో తెలుగు నేర్చుకుని రాయ‌డం..మాట్లాడ‌టం అంటే? ఇది మాట‌ల్లో చెప్ప‌లేని ప్రేమ‌గానే చెప్పాలి.

జ‌పాన్ లో తార‌క్ అభిమానులున్నారని తెలుసు. కానీ మ‌రీ ఈ రేంజ్ లో అభిమానం చూపించే వారు ఉన్నార‌ని మ‌రోసారి బ‌య‌ట ప‌డింది. అంత‌కు ముందు తార‌క్ లండ‌న్ వెళ్లిన స‌మ‌యంలో ఓ జపాన్ అభిమాని ఎంత‌గా ప్రేమ చూపించిందో తెలిసిందే. తార‌క్ ని క‌ల‌వ‌డం కోస‌మే లండ‌న్ కు వ‌చ్చిన‌ట్లు ఆమె తెలిపారు. అదే స‌మ‌యంలో త‌ప్ప‌కుండా మ‌ళ్లీ జపాన్ రావాల‌ని ఆ లేడీ అభిమాని తార‌క్ ని స్వాగ‌తించారు.

ఆ త‌ర్వాత తార‌క్ జపాన్ వెళ్ల‌డం ఇదే తొలిసారి. మరి ఆ లేడీ అభిమానిని తార‌క్ క‌లిసాడో ? లేదో. ప్ర‌స్తుతం 'దేవ‌ర' జ‌పాన్ థియేట‌ర్ల‌లో ర‌న్నింగ్ లో ఉంది. సినిమాకి అక్క‌డ మంచి టాక్ వ‌చ్చింది. మ‌రి వ‌సూళ్ల లెక్క తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం తార‌క్ బాలీవుడ్ లో `వార్ 2`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `డ్రాగ‌న్` లోనూ న‌టిస్తున్నాడు.

Tags:    

Similar News