దేవర మూవీ… ఒత్తిడిలో ఉన్న ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే ‘దేవర’ సినిమా కోసం నందమూరి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Update: 2024-09-24 08:43 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే ‘దేవర’ సినిమా కోసం నందమూరి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ పెరిగిన్ విషయం తెలిసిందే. దానికి తగ్గట్లుగానే ‘దేవర’ సినిమాకి బిజినెస్ జరిగింది. ఈ సినిమాపై థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ ద్వారా 350 కోట్ల వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. మేకర్స్ టేబుల్ ప్రాఫిట్ తో మూవీని రిలీజ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ ని తన భుజాలపై వేసుకొని గ్రాండ్ గానే హైలెట్ చేస్తున్నారు. అన్ని భాషలలో ప్రేక్షకులకి సినిమాని కనెక్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలలో ‘దేవర’ మూవీ గురించి తారక్ ఇంటరెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రమోషన్స్ విషయంలో తనకి పెద్దగా టెన్షన్ లేదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. రాజమౌళి మూవీ కావడంతో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ ని ఫుల్ గా ఆస్వాదించాను. అయితే ‘దేవర’ మూవీ విషయంలో మాత్రం కొంత ఒత్తిడి ఉందని ఎన్టీఆర్ అన్నారు.

ఈ సినిమా అవుట్ ఫుట్ పైన నాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది. అయితే ఆరేళ్ళ తర్వాత సోలోగా ‘దేవర’ మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాను. ‘దేవర’ మూవీ విషయంలో ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. అందుకే ఒత్తిడి ఎక్కువగా ఉందని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే ‘దేవర’ సినిమాని ముందు రెండు భాగాలుగా చేయాలని అనుకోలేదు. మొత్తం కథ అంతా సిద్ధం అయ్యాక ఐదు గంటల నిడివి వచ్చింది. ఒకే సినిమా ఐదు గంటలు అంటే ఆడియన్స్ ఆస్వాదించడం కష్టం.

దీనిని దృష్టిలో ఉంచుకొని సినిమాని రెండు భాగాలుగా చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా టైటిల్ ‘దేవర’ తెలుగు గ్రామీణ సంస్కృతిలో భాగంగా ఉంటుంది. ఆ టైటిల్ మూవీకి యాప్ట్ అవుతుందని పెట్టడం జరిగింది. ఇక అతి విశ్వాసం కూడా ఒక్కోసారి ప్రజలకి ప్రమాదకరంగా మారుతుంది. సినిమాలో ‘దేవర’ క్యారెక్టర్ ని భయపెట్టేవాడిగా రిప్రజెంట్ చేయడం జరిగింది. సినిమాలో ప్రత్యేకత కూడా అదే అని తారక్ అన్నారు.

‘దేవర’ మూవీ తర్వాత అనిరుద్ పేరు ఇంటర్నేషనల్ లెవల్ లో వినిపించడం గ్యారెంటీ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అనిరుద్ కథని అర్ధం చేసుకొని అద్భుతమైన సంగీతం ఈ చిత్రానికి ఇచ్చాడని అన్నారు. అలాగే జాన్వీ కపూర్ కూడా డైలాగ్స్ కి బాగా అర్ధం చేసుకొని నటించిందని తారక్ ప్రశంసించారు. అన్ని భాషలలో ఈ మూవీ కంటెంట్ ప్రేక్షకులకి కచ్చితంగా కనెక్ట్ అవుతుందని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News