ప్రభాస్ బాక్సాఫీస్ ట్రాక్.. ఇప్పుడు తారక్ వంతు!

ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల జాబితాలో కూడా వీరు నలుగురు టాప్ లో ఉన్నారు.

Update: 2024-09-17 03:47 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలుగా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గ్లోబల్ లెవల్ లో వారి సినిమాలకి 300 నుంచి 400 కోట్ల బిజినెస్ జరుగుతోంది. అలాగే హిట్ టాక్ వస్తే ఈజీగా 500 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించే సత్తా ఉన్న హీరోలుగా ఉన్నారు. సూపర్ సక్సెస్ అందుకుంటే 1000 కోట్ల వరకు తమ సినిమాలతో అందుకోగలరు.

ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల జాబితాలో కూడా వీరు నలుగురు టాప్ లో ఉన్నారు. ప్రభాస్ ‘బాహుబలి 2’ తర్వాత ఇప్పటి వరకు ఐదు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరో ఐదు ప్రాజెక్ట్స్ లైన్ అప్ లో ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ ‘దేవర’తో సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవల్ లో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ తో రానున్నారు.

‘పుష్ప’తో పాన్ ఇండియా హిట్ అందుకొన్న ‘పుష్ప 2’తో సక్సెస్ రికార్డ్ ని కొనసాగించడానికి అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ అంచనాలు ఈ చిత్రంపై ఉన్నాయి. ఈ సినిమా ముందు చాలా టార్గెట్స్ ఉన్నాయి. వాటిని తారక్ తన ఇమేజ్ తో అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందులో 150+ కోట్ల షేర్ ఒకటి. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ మాత్రమే 6 సార్లు 150+ కోట్ల షేర్ ని అందుకున్నారు.

బన్నీ రెండు సార్లు 150+ కోట్ల షేర్ ‘అల వైకుంఠపురంలో’, ‘పుష్ప’ సినిమాలతో అందుకున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ తో 150+ కోట్ల షేర్ ని సాధించారు. ఇప్పుడు సోలోగా ‘దేవర’తో 150+ కోట్ల షేర్ ని తారక్ అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే 200+ కోట్ల షేర్ ప్రభాస్ 5 సార్లు అందుకుంటే రామ్ చరణ్, తారక్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ తో ఒకసారి 200+ కోట్ల షేర్ సాధించగలిగారు.

‘దేవర’ మూవీ 200+ కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే కచ్చితంగా తారక్ అల్లు అర్జున్ తో ఈక్వల్ లెవల్ లో ఉంటాడు. నెక్స్ట్ తారక్ నుంచి రాబోయే ‘వార్ 2’,’ డ్రాగన్’ చిత్రాలు 200+ కోట్ల కలెక్షన్స్ ని చాలా ఈజీగా అందుకుంటాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. ‘దేవర’ సినిమాతో తారక్ ప్రూవ్ చేసుకుంటే పాన్ ఇండియా స్టార్ గా అతని హవా ఇప్పట్లో ఆగదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా రేస్ లో రెండో స్థానంలోకి వెళ్తాడా అనేది చూడాలి.

Tags:    

Similar News