దేవర పై ఎన్టీఆర్ క్లారిటీ.. టైటిల్ వెనక ఇంత కథ ఉందా..

జూనియర్ ఎన్టీఆర్ , జాన్వి కపూర్ నటిస్తున్న దేవర చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది.

Update: 2024-09-19 07:06 GMT

జూనియర్ ఎన్టీఆర్ , జాన్వి కపూర్ నటిస్తున్న దేవర చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ కావడంతో దేవర చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు చిత్రం నుంచి విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను ఓ రేంజ్కి తీసుకువెళ్లాయి. ఇక కొరటాల కాంబోలో ఇంతకుముందు ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు.

అందుకే ఈ ఇద్దరి కాంపోలో వస్తున్న దేవర చిత్రం మొదటినుంచి మంచి బజ్ సృష్టిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న దేవర చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ మోడ్ లో కనిపించబోతున్నారు అన్న విషయం అర్థమవుతుంది. ఇక మూవీ రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బాగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ మూవీ పై తన ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని చెప్పిన ఎన్టీఆర్ మరొక విడుదల దగ్గర పడుతుండడంతో కాస్త టెన్షన్ గా ఉంది అని పేర్కొన్నారు. అయితే తన చిత్ర బృందంపై తనకు ఎంతో నమ్మకం ఉందని.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న దేవర చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న నమ్మకం తనకు ఉంది అని ఎన్టీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీకి మ్యూజిక్ అందించిన అనిరుద్ గురించి కూడా ఎన్టీఆర్ తెగ పొగడేసారు. సినిమాకి ఏ సీన్ కి ఎంతవరకు మ్యూజిక్ అవసరం అన్న విషయంపై అనిరుద్ కి చాలా స్పష్టత ఉందని.. ఈ మూవీలో మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడు అంటున్నాడు ఎన్టీఆర్.

ఇక మూవీ టైటిల్ గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దేవరా అనే టైటిల్ ని ఎంచుకున్నట్టు చెప్పారు. దేవర అంటే దేవుడు అని అర్థం వస్తుంది.. అంటే ఇక్కడ హీరో తనని నమ్ముకున్న వాళ్ళ పారిట దేవుడు అని కన్వెజ్ చేయడం డైరెక్టర్ అసలు ఉద్దేశం అయ్యుండొచ్చు. విడుదలకు ముందే సెన్సేషన్ సృష్టిస్తున్న దేవర బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరి..

Tags:    

Similar News