దేవర వాటర్ సీక్వెన్స్.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్..!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర సినిమా శుక్రవారం రిలీజై వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది.

Update: 2024-09-29 07:16 GMT

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర సినిమా శుక్రవారం రిలీజై వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది. సినిమాకు మొదట వచ్చిన టాక్ కు ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కు అసలు పొంతన లేదు. పోటీగా ఏ సినిమా లేకపోవడంతో పాన్ ఇండియా లెవెల్ లో దేవర దమ్ము చూపిస్తుంది. ఐతే దేవర సినిమా కోసం ఎన్ టీ ఆర్ లాస్ ఏంజిల్స్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రీమియర్ లో పాల్గొన్నాడు. అక్కడ ఫ్యాన్స్ తో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను ముచ్చటించారు.

బియాండ్ ఫెస్ట్ ఈవెంట్ లో ఎన్టీఆర్ దేవర లోని వాటర్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. RRR కోసం చాలా రోజులు వాటర్ లోనే ఉండటం జరిగింది. దేవర పార్ట్ 1 లో కూడా వాటర్ సీక్వెన్స్ చేశా. ఐతే మీ స్పందన చూస్తుంటే దేవర పార్ట్ 2 లో కూడా వాటర్ సీక్వెన్స్ తప్పేలా లేదనిపిస్తుందని అన్నారు. ఎన్టీఆర్ దేవర సినిమాకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా బాగా చేశారని అన్నారు. ఐతే వి.ఎఫ్.ఎక్స్ విషయంలో రాజమౌళి స్పెషల్ కేర్ తీసుకుంటారు. వాటి గురించి ఆయన ఎంతసేపైనా మాట్లాడతారని అన్నారు.

నటుడిగా అది ఎంత కష్టమో తనకు తెలుసు. వి.ఎఫ్ ఎక్స్ ద్వారా వాటర్ క్రియేట్ చేసి అది నిజమైన దానిలా కనిపించేలా చేయడం చాలా కష్టమని అన్నారు ఎన్టీఆర్. దేవర వాటర్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇచ్చింది. ఐతే అక్కడక్కద కొన్ని ఫ్లాస్ ఉన్నా మొత్తంగా యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ ని మెప్పించాయి. దేవర 1 సినిమా వసూళ్లు చూస్తుంటే సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తున్నట్టు అనిపిస్తుంది.

దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటించింది. ఐతే ఆమె పాత్ర నిడివి తక్కువ ఉందన్న మాట వినిపిస్తుంది. ఐతే ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో ఫ్యాన్స్ కి కావాల్సినంత జోష్ ఇచ్చాడు. ఎలాగు వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి దేవరకు కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. దేవర పార్ట్ 1 ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హైయ్యెస్ట్ కలెక్షన్స్ తెచ్చుకునేలా ఉంది.

Tags:    

Similar News