'దేవర' – ప్రీ సేల్స్ తోనే ట్రెండ్ సెట్టర్

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర - 1 విడుదలకు ముందు నుంచే రికార్డుల మోత మోగిస్తోంది.

Update: 2024-09-25 09:42 GMT

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర - 1 విడుదలకు ముందు నుంచే రికార్డుల మోత మోగిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది భారతీయ సినిమా రంగంలో అత్యంత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షించటంలో సక్సెస్ అయ్యింది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది.


తాజా సమాచారం ప్రకారం, అమెరికాలోనే ప్రీ సేల్స్ ద్వారా ఈ సినిమా ఇప్పటికే 2 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఇది ఎన్టీఆర్ సినిమాల మీద ఉన్న క్రేజ్ ని, అలాగే ప్రేక్షకులలో అతనిపై ఉన్న అభిమానం ఎంతలా పెరిగిందో తెలియజేస్తుంది. RRR తరువాత జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ప్రీ సేల్స్ ద్వారా 2 మిలియన్ డాలర్లు దాటిన సినిమా హీరోగా నిలిచాడు. వరుసగా రెండు సినిమాలకు ఈ స్థాయిలో సేల్స్ సాధించడం ఎన్టీఆర్ కు ప్రత్యేకతగా నిలిచింది.

సినిమా విడుదల తర్వాత టాక్ బాగుంటే విదేశీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేయడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవర కు ఉత్సాహభరితమైన అడ్వాన్స్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా మీద ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. దీనివల్ల మొదటి రోజు, వారాంతంలో భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సినిమా యూనిట్ మొత్తం కూడా ప్రమోషన్ తో ఈ అంచనాల్ని మరింత పెంచుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ భారీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం మరో ప్రత్యేకత. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. యూట్యూబ్ లోమిలియన్స్ వ్యూవ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.

సినిమాకు ప్రస్తుతం బజ్ అయితే గట్టిగానే ఉంది. విడుదలైన రెండు ట్రైలర్స్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక టాక్ బాగుంటే సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటి రోజు దేవర తప్పకుండా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. మరి ఆ దిశగా దేవర 100 కోట్లు అందుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News