ఎన్టీఆర్ వీడియో వైరల్.. ఇలాంటివి సోషల్ మీడియాలో పెట్టడం కరెక్టేనా?

అయితే ఈ మధ్యన రెగ్యులర్ గా హైదరాబాద్ టూ ముంబై ట్రావెల్ చేస్తున్న తారక్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Update: 2024-10-28 10:18 GMT

RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతమ 'దేవర' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'వార్ 2' సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి రెడీ అయ్యారు. ఇందులో బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అయితే ఈ మధ్యన రెగ్యులర్ గా హైదరాబాద్ టూ ముంబై ట్రావెల్ చేస్తున్న తారక్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్, తన సతీమణి లక్ష్మి ప్రణతితో కలిసి ఓ హోటల్ నుండి బయటకు నడుచుకుంటూ వస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వారితో పాటుగా 'వార్ 2' దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఉన్నారు. అయితే ఈ వీడియోలో తారక్ కొంచెం తడబడుతూ నడుస్తూ కనిపించారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ బాగా డ్రింక్ చేసినట్లున్నారని, మద్యం మత్తులోనే అలా నడుస్తున్నారని యాంటీ ఫ్యాన్స్ కథనాలు ప్రచారం చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ తన చేతిలోని గ్లాస్ ని వెనుక దాచుకోడానికి ప్రయత్నించడాన్ని గమనిస్తే, అది నిజమే అనిపిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు.

ఇది ఎడిట్ చేయబడిన వీడియో అయ్యుండొచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం 'వార్ 2' షూటింగ్ లో కాలికి ఏదైనా గాయం అయిందేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా మనం నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు తడబడటం కామనే అని, దీంట్లో ఎన్టీఆర్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఈ వీడియో నిజమైనా, సెలబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందనే విషయం మనం మర్చిపోకూడదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ తారక్ తన భార్యతో కలిసి వెళ్లారని, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడకు ఫాలో అయి ఇలాంటి వీడియోలు తీసి పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

నిజానికి గతంలోనూ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ వీడియో ఇలానే వైరల్ అయింది. ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి పాట పాడుతున్న వీడియో ఇది. ఆయన డ్రింక్ చేసి ఇలా పాట పాడారని, తారక్ కు రోడ్డు ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు వీడియో ఇదని అప్పట్లో కొందరు ప్రచారం చేసారు. కానీ రాజీవ్ కనకాల లాంటి ఆయన స్నేహితులు కొందరు ఈ విషయాన్ని కొట్టిపారేసారు. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియో బ్యాడ్ గా సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.

ఇటీవల కాలంలో రెస్టారెంట్‌లు, ఎయిర్ పోర్టులు, ఇతర బహిరంగ ప్రదేశాల వద్ద సెలబ్రిటీల వీడియోల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో కొందరు గీత దాటి ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. బిజీ లైఫ్ లో సరదాగా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్తుంటారు.. అప్పుడప్పుడు ప్రైవేట్ గా పార్టీలు చేసుకుంటారు. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే.. ఎంత పెద్ద స్టార్స్ అయినా వాళ్ళు కూడా తమ స్వంత వ్యక్తిగత సమయాన్ని కలిగి ఉంటారని గమనించాలి. వ్యూస్ కోసం హీరో హీరోయిన్ల ప్రైవేట్ లైఫ్ ను కెమెరాల్లో బంధించి, పబ్లిక్ మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటి వీడియోలను ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు.

Tags:    

Similar News