తార‌క్ కూడా అలా ఫీల‌య్యాడా?

సాధార‌ణంగా కొత్త ప్లేస్ లో ప‌నిచేయాలంటే ఓ ర‌క‌మైన వింత అనుభూతి క‌లుగుతుంది.

Update: 2024-09-21 10:21 GMT

సాధార‌ణంగా కొత్త ప్లేస్ లో ప‌నిచేయాలంటే ఓ ర‌క‌మైన వింత అనుభూతి క‌లుగుతుంది. అక్క‌డ వాతావ‌ర‌ణం.. మ‌నుషుల ప్ర‌వ‌ర్త‌నా తీరు ఇలా ఏవి అవ‌గాహ‌న ఉండ‌వు కాబ‌ట్టి అల‌వ‌ర్చుకోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. కానీ కొంత మంది అలా కాదు. తొలి రోజే ప‌నిలో నిమ‌గ్న‌మ‌వుతారు. చుట్టూ ఉన్న వారితో క‌లిసి పోతారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అలాంటి హీరో ఎవ‌రైనా ఉన్నారు? అంటే అది యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అని గ‌ట్టిగా చెప్పొచ్చు.

తార‌క్ చ‌లాకీ త‌నం...క‌లుపుగోలు త‌నం గురించి తెలిసిందే. అలియాభ‌ట్ తో తార‌క్ ప‌నిచేసింది కేవలం ఒక్క సినిమాకే. కానీ అత‌డు ఆమెకి ఎంత క్లోజ్ ప్రెండ్ గా మారిపోయాడు? అన్న‌ది `ఆర్ ఆర్ ఆర్` ప్రచారం స‌మ‌యం లో బ‌య‌ట ప‌డింది. తార‌క్ , రామ్ చ‌ర‌ణ్‌, అలియాభ‌ట్ కలిసి ఈవెంట్ల‌కు హాజ‌రైన ప్పుడు.. .అలియా-తార‌క్ మ‌ధ్య గిల్లిక‌జ్జాల గొడ‌వ‌లు ఎలా సాగేవే తెలిసిందే. ఒక‌ర్ని ఒకరు గిల్లుకునే వారు.

ఎంతో స‌ర‌దాగా ఉండేవారు. కానీ పక్క‌నే రామ్ చ‌ర‌ణ్ మాత్రం అలియా విష‌యంలో కామ్ గా ఉండేవాడు. అలియాతో పెద్ద‌గా మాట్లాడేవాడు కాదు...మ‌రీ అంత క్లోజ్ గానూ మూవ్ అయ్యేవాడు కాదు. ఈ క‌లుపు గోలుతనం అన్న‌ది కొంద‌రిలో చిన్న‌నాటి నుంచి ఉంటుంది. తార‌క్ లో ఇది పుష్క‌లంగా ఉంది. అందుకే తార‌క్ అంటే? సెట్స్ లో గిల్లుతాడు..గిచ్చుతాడ‌ని రాజ‌మౌళి సైతం కంప్లైంట్ చేస్తుంటాడు. అలాంటి తార‌క్ కి బాలీవుడ్ `వార్ -2 `షూటింగ్ లో తొలి రోజు చాలా అసౌక‌ర్యంగా అనిపించిందిట‌.

అక్క‌డ ప‌నిచేయ‌డం మొదటిసారి కావ‌డంతో కొన్ని ర‌కాల అడ్డంకుగులు అధిగ‌మించాల్సి వ‌చ్చింద న్నాడు. అంతా కొత్త వారు కావ‌డంతో? మూవ్ అవ్వ‌డం ఇబ్బందిగా ఉండేద‌న్నాడు. కానీ ప‌నిచేయ‌డం అల‌వాటైన త‌ర్వాత మాత్రం అంతా ఒక‌టే అన్న భావ‌న క‌లిగింద‌న్నాడు. అక్క‌డ ఎలాంటి విబేధాలు ఉండ‌ని అన్నాడు. ఇప్పుడు పూర్తిగా సౌక‌ర్య‌వంతంగా ప‌నిచేస్తున్నాన‌న్నాడు.

Tags:    

Similar News