ఎన్టీఆర్‌ మూవీ టైటిల్‌ 'యుద్ద భూమి'

ఎన్టీఆర్‌ ఇటీవలే దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేసి మెప్పించాడు

Update: 2024-10-19 10:34 GMT

ఎన్టీఆర్‌ ఇటీవలే దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేసి మెప్పించాడు. రెండు విభిన్న పాత్రల్లో నటించడం ద్వారా ఎన్టీఆర్‌ మరోసారి తన నట విశ్వరూపం ను చూపించే అవకాశం దక్కింది. దేవర సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు నమోదు కావడంతో అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్‌ నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్‌ 'వార్‌ 2' సినిమా షూటింగ్‌ కు జాయిన్ అయిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం ముంబైలో వార్‌ 2 సినిమా షూటింగ్‌ జరుగుతోంది. బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హృతిక్ రోషన్‌ హీరోగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో ఎన్టీఆర్‌ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే వార్‌ 2 టైటిల్‌ తోనే హిందీలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాను తెలుగు లో మాత్రం యుద్ద భూమి అనే టైటిల్‌ తో రిలీజ్ చేయబోతున్నారట. వార్‌ 2 అనే టైటిల్‌ ను కంటిన్యూ చేస్తూ యుద్ద భూమి అనే పదంను ట్యాగ్‌ గా పెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి యుద్ద భూమి టైటిల్‌ ను ఎన్టీఆర్‌ కోసం మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ చాలా పవర్ ఫుల్‌ పాత్రలో వార్‌ 2 లో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా సినిమాలో ఎన్టీఆర్‌ లుక్ సైతం చాలా ఎనర్జిటిక్‌ గా ఉంటుందని తెలుస్తోంది. కెరీర్‌ ఆరంభం నుంచి ఎన్టీఆర్‌ విభిన్న చిత్రాలను చేయడం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు వార్‌ 2 : యుద్ద భూమి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం ఎన్టీఆర్‌ నటనకు సర్‌ప్రైజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ భారీ స్పై థ్రిల్లర్‌ వచ్చే ఏడాది ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వార్‌ 2 తర్వాత ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. షూటింగ్‌ వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ వార్‌ 2 ను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి వరకు పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చేయబోతున్న సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్‌, సలార్‌ వంటి సినిమాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ చేయబోతున్న సినిమా ఎన్టీఆర్ తో కావడం తో సహజంగానే అంచనాలు ఆకాశానికి తాకే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News