దేవర.. ఆ ఎపిసోడ్ కోసం స్పెషల్ ట్రైనింగ్

చాలా మంది స్టార్ క్యాస్టింగ్ ని ఈ మూవీ కోసం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయంట

Update: 2023-08-29 04:27 GMT

యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో దేవర మూవీ చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది.

చాలా మంది స్టార్ క్యాస్టింగ్ ని ఈ మూవీ కోసం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయంట. ఇప్పటికే కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేశారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నేతృత్వంలో ఈ సన్నివేశాలు అన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం టాకీ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీని ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారంట.

ఇందులో గ్రాఫిక్స్ కోసమే ఏకంగా 70 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నారంటే సినిమా ఏ లెవల్ లో ఉండబోతోందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా మూవీకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. సినిమాలో ఒక అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందంట. దీనికోసం తారక్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారంట. ముంబై నుంచి ఈ సీక్వెన్స్ షూట్ కోసం ట్రైనర్స్ ని తీసుకొచ్చి తారక్ కి శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సీన్ మూవీకి హైలైట్ గా ఉంటుందంట. ఇలాంటి పవర్ ఫుల్ యాక్షన్ బ్లాక్స్ చాలా వరకు సినిమాలో ఉంటాయని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. కచ్చితంగా దేవర సినిమాతో తారక్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. తారక్ కూడా ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ అందుకోవడం కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు.

లుక్ నుంచి ప్రతి విషయంలో కేర్ తీసుకొని దేవర సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా స్టోరీ కంప్లీట్ గా ఓ ఫిక్షనల్ ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని తెలుస్తోంది.

Tags:    

Similar News