'దేవ‌ర' కోసం క‌ర్ణాట‌క నుంచి ఇసుక బండ‌రాళ్లు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `దేవ‌ర` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2023-09-24 13:35 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `దేవ‌ర` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ మాస్ ఇమేజ్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా కొరాటాల మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతుంది. పీట‌ర్ హెయిన్స్..కెన్నీ బేట్స్ లాంటి ప్ర‌ఖ్యాత హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్లు సినిమా కోసం ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే సినిమాలో ఓ అండ‌ర్ వాట‌ర్ యాక్ష‌న్ సీన్ అదిరిపోతుంద‌ని ప్ర‌చారం సాగుతుంది.

ఆ స‌న్నివేశాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చిత్రీక‌రించారు. అందుకోసం నెల‌ల త‌ర‌బ‌డి స‌మ‌యం కేటాయించారు. స‌ముద్ర గ‌ర్భంలో జ‌రిగే యాక్ష‌న్ సీన్ కోసం ప్ర‌త్యేకంగా ఓ బ్లూమ్యాట్ ని వేసారు. అచ్చంగా స‌ముద్రాన్ని త‌ల‌పిస్తుంది. అందుకు అధ‌నునాత‌న సాంకేతిక‌ ప‌రిజ్ఞానాన్ని వినియోగించారు. ఈ సీన్ కోసం వంద‌ల మంది ఫైట‌ర్లు ప‌నిచేసారు. ఇలా ఆ యాక్ష‌న్ స‌న్నివేశానికి చాలా ప్ర‌త్యేక‌త‌లు న్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరుగుతోంది. ఇక్క‌డా కొన్ని యాక్ష‌న్ సన్నివేశాల తో పాటు ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. సెంటిమెంట్ స‌న్నివేశాలు ఎంతో హృద్యంగా ఉండ‌బోతున్నాయ‌ని అంటున్నారు. ఆ స‌న్నివేశాల్లో తార‌క్ న‌ట‌న అద్భుతంగా ఉంటుంద‌ని చూసిన వారు చెబుతున్నారు. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త తార‌క్ ఆయా స‌న్నివేశాల్లో క‌నిపిస్తాడ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదో మ‌త్స‌కార గ్రామం చుట్టూ తిరిగే క‌థ‌. జాల‌రి యువ‌కుడి పాత్ర‌లో టైగ‌ర్ న‌టిస్తున్నాడు. తీర ప్రాంతం సెట్ కోసం ప్ర‌త్యేకంగా బీచ్ సెట్ ని రూపోందించారు.సాబు సిరిల్ ఆధ్వ‌ర్యంలో ఈ సెట్ నిర్మాణం జ‌రిగింది. సెట్ చాలా స‌హ‌జంగా ఉంటుంది. అచ్చంగా బీచ్ ..తీర ప్రాంతాన్నే త‌ల‌పించేలా ఉంటుంద‌ని చూసిన వారు చెబుతున్నారు. ఆర్ట్-ఎఫెక్టివ్‌నెస్- రియలిస్టిక్ లుక్-సెట్‌లో ఒక చివర నీటి తరంగాలను అనుకరించే విధానం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందిట‌. ఇందులో వాడే ఇసుక కూడా బ‌య‌ట రాష్ట్రాల నుంచి తెప్పించిన‌ట్లు తెలుస్తోంది. టన్నుల కొద్దీ ఇసుకని కర్ణాటకలోని కొన్ని టాప్ బీచ్‌ల తీసుకొ చ్చారుట‌. అలాగే అవ‌స‌ర‌మైన కొన్ని బండరాళ్లును- పెద్ద రాళ్లను కూడా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారుట‌.

Tags:    

Similar News