సలార్ చూసి దేవరలో మార్పులు..?

అఫ్కోర్స్ ప్రభాస్ ఛరిష్మాతో అవేవి కనిపించలేదు. బాలీవుడ్ లో సలార్ వసూళ్లు చూస్తే ఇది నిజమే అనిపించక తప్పదు

Update: 2023-12-25 16:30 GMT

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకున్నా కె.జి.ఎఫ్ రేంజ్ లో లేదన్న మాట కొందరి నోట వినపడుతుంది. ప్రభాస్ ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్ ఓకే కానీ ప్రశాంత్ నీల్ ఎక్కడో ఎమోషనల్ కనెక్షన్ మిస్ చేశాడని చెప్పుకుంటున్నారు. అఫ్కోర్స్ ప్రభాస్ ఛరిష్మాతో అవేవి కనిపించలేదు. బాలీవుడ్ లో సలార్ వసూళ్లు చూస్తే ఇది నిజమే అనిపించక తప్పదు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఇలా ఉంటే సలార్ 2 ఎలా ఉంటుంది అన్న కన్ఫ్యూజన్ మొదలైంది. దేవ, వరద రాజమన్నార్ ల మధ్య యుద్ధమే సలార్ 2 కథ అని తెలుస్తుంది.

దాన్ని ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నది చూడాలి. సలార్ సినిమాలో కొన్ని తప్పులు దొర్లిన మాట వాస్తవమే.. కె.జి.ఎఫ్ రెండు భాగాల్లో రైటింగ్ సైడ్ ఎక్కడ ఆడియన్స్ కి డౌట్లేమి లేకుండా చేసిన ప్రశాంత్ నీల్ సలార్ విషయంలో తడబడ్డాడు అనిపిస్తుంది. ఈ కారణంతో కొందరు సలార్ రెండు భాగాలుగా కాకుండా ఒక సినిమాగా చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. సలార్ కథలో కావాల్సినంత డ్రామా ఉంది అందుకే ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తున్నామని ప్రశాంత్ నీల్ అన్నారు.

కానీ సినిమాలో మేజర్ రోల్ పోశించే ఆ డ్రామా ఆడియన్స్ కి రీచ్ అవ్వకపోతే ఎలా ఉంటుంది. అందుకే సలార్ సినిమాను చూసి కొన్ని సెట్స్ మీద ఉన్న సినిమాలు మార్పులు చేస్తున్నారని టాక్. ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా కూడా ముందు ఒక సినిమాగానే అనుకున్నారు కానీ ఇప్పుడు అది రెండు భాగాలుగా చేస్తున్నారు. సలార్ విషయంలో జరిగిన తప్పులు రిపీట్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత కొరటాల మీద ఉంది.

ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు అవసరం ఉన్నా లేకపోయినా రెండు భాగాలుగా తీస్తున్నారు. కథలో, పాత్రల్లో ప్రేక్షకులు లీనమైతేనే పార్ట్ 2 తీసినా కాస్త ప్రయోజనం ఉంటుంది. సలార్ 1 ఎలాగు ఫైనల్ గా టెస్ట్ లో పాస్ అయ్యింది. సలార్ 2 ఎలా ఉంటుందో చూడాలి. ఇక దేవర సినిమాపై కూడా తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాను కొరటాల ఏం చేస్తాడో చూడాలి. తారక్ దేవర సినిమా మొదటి భాగం 2024 ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు.

Tags:    

Similar News