చరణ్ కూతురి కోసం తారక్ ఏం చేశాడంటే..

ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రామ్ చరణ్ కూతురు కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడంట.

Update: 2023-07-19 10:42 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకి ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిందే. ఆమెకి క్లీంకార అనే పేరు పెట్టారు. ప్రకృతి శక్తిని సింబాలిక్ గా ఈ పేరుని సంస్కృతం నుంచి తీసుకొని పెట్టడం జరిగింది. ఈ పేరు సోషల్ మీడియా లో విపరీతంగా పాపులర్ అయిపొయింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా లో ఇద్దరూ కూడా ఎలాంటి ఇగోలు లేకుండా పోటీ పడి నటించడానికి కారణం వారి మధ్య రిలేషన్ అని చెప్పాలి. ఇద్దరు కూడా చాలా సందర్భాల లో తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని చెప్పారు. చిన్నప్పటి తమ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఉందని రామ్ చరణ్ చాలా ఇంటర్వ్యూల లో క్లారిటీ ఇచ్చారు. క్లీంకార పుట్టిన సందర్భంగా తారక్ ప్రత్యేకంగా చరణ్ కి విషెస్ చేశారు.

ప్రస్తుతం తారక్ దేవర సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. అలాగే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ పై ఉన్నారు. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకునే పని లో ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రామ్ చరణ్ కూతురు కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడంట. దీని ని ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరి కానుకగా అందించినట్లు టాక్.

ఉపాసన, చరణ్, క్లీంకార ఫోటోలు ప్రింట్ చేసి వారి జ్ఞాపకంగా ఉండిపోయేలా ఓ గోల్డ్ డాలర్ ని బహుమతిగా ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఎన్టీఆర్ పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లకి ఈ గిఫ్ట్ భాగా నచ్చిందంట. అద్భుతమైన డిజైన్ తో ఈ డాలర్ ని చేయించి ఇచ్చినట్లు సమాచారం.

ఏది ఏమైనా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహబంధం ఎంత గొప్పదో చెప్పడానికి ఇది సాంపిల్ మాత్రమే అంటున్నారు. అయితే ఫ్యాన్స్ ముసుగు లో చాలా మంది సోషల్ మీడియా లో ఇద్దరి మధ్య దూరం ఉన్నట్లుగా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. వాటిని పట్టించుకోకుండా తమ రిలేషన్ ని తారక్, చెర్రి కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News