బాక్సాఫీస్ తగలబడేలా.. ఎన్టీఆర్ హై వోల్టేజ్ లైనప్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాపై ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాపై ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్య తో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ దేవర ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో పాటూ బలమైన కథని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాడు.ఈ సినిమా కోసం కెన్నీ బెట్స్ లాంటి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ మూవీతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా పరిచయం అవుతుంది.
బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలను మరింత పెంచుతూ సినిమా నిర్మాతల్లో కలిగిన కళ్యాణ్ రామ్ రీసెంట్ గా డెవిల్ ప్రమోషన్స్ లో దేవర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
దేవర దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని, ప్రస్తుతం VFX పనులు జరుగుతున్నాయని, త్వరలోనే గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నామని, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటివరకు రాని ఓ భారీ విజువల్ ట్రీట్ ని దేవర తో ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం దేవరపై హైట్ పిక్స్ చేరిపోయింది కాగా దేవర తర్వాత ఎన్టీఆర్ లైనప్ కూడా సాలిడ్ గా ఉండబోతోంది.
దేవర సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. పార్ట్ వన్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ఆలస్యం చేయకుండా బాలీవుడ్ బడా ప్రాజెక్టు 'వార్ 2' షూటింగ్లో జాయిన్ అవుతాడు. వీలైనంత త్వరగా 'వార్ 2' ను ముగించి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత 'దేవర పార్ట్ 2' ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్నాయి.
ఇంత సాలిడ్ అండ్ లాంగ్ లైనప్ టాలీవుడ్ లో మరే స్టార్ హీరోకి లేదు. ఈ సినిమాలు కనుక సక్సెస్ అయితే ఎన్టీఆర్ క్రేజ్ పీక్స్ కు చేరడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లిన తారక్ తిరిగి వచ్చిన వెంటనే దేవర మిగతా షూటింగ్ పూర్తిచేసి వెంటనే 'వార్ 2' సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు