ఎన్టీఆర్.. ఈ టైమ్ లో అది చాల ముఖ్యం టైగర్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని ప్రకటించిన చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. షూటింగ్ మార్చి నాటికి కంప్లీట్ అయిన పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయ్యే అవకాశం ఉందని టాక్. అదే జరిగితే దేవర సెప్టెంబర్ కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంట.
దేవర కంప్లీట్ కాగానే హిందీలో వార్ 2 మూవీలో తారక్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయాన్ ముఖర్జీ ఏరికోరి తారక్ కి వార్ 2లో రోల్ కోసం ఎంపిక చేసుకున్నాడు. యష్ రాజ్ లాంటి పెద్ద ప్రొడక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
అయితే తారక్ ఐదేళ్ళలో ఒక్క ఆర్ఆర్ఆర్ మూవీతో మాత్రమే ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీ తారక్ కి గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చిన కూడా మూడు, నాలుగు సినిమాలు రావాల్సిన సమయాన్ని తీసేసుకుంది. దీంతో దేవరతో కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ పడాల్సిందే. ఆచార్య తర్వాత కొరటాల శివ చేస్తోన్న సినిమా కావడంతో అభిమానులు కొంత టెన్షన్ పడుతున్నారు.
అలాగే వార్ 2 గురించి ఆలోచిస్తే యష్ రాజ్ నుంచి రీసెంట్ గా వచ్చిన రెండు స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. పఠాన్ తో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్ద్ ఆనంద్ ఫైటర్ అంటూ హృతిక్ రోషన్ కి తాజాగా డిజాస్టర్ ఇచ్చాడు. పఠాన్ స్టొరీనే మళ్ళీ తిప్పి తీసినట్లు ఉందనే విమర్శలు వస్తున్నాయి. అలాగే యష్ రాజ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన టైగర్ 3 డిజాస్టర్ అయ్యింది.
ఈ చిత్రాలు ఫెయిల్ కావడానికి కారణం రొటీన్ ఫార్ములా లైన్ సినీ విశ్లేషకులు అంటున్నారు. టైగర్ 3, ఫైటర్ ఇంపాక్ట్ వార్ 2 మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మీద ఎలాంటి అంచనాలు ఉంటాయనేది సలార్ 2 మూవీ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. కెరియర్ లో చాలా కీలకమైన దశలో తారక్ చేస్తోన్న సినిమాలు ఫ్యాన్స్ ని కంగారుపెట్టిస్తున్నాయని టాక్.