దేవర రాలేదు కానీ, ఎన్టీఆర్‌ కొత్త సంవత్సర కానుక ఇదే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కొత్త సంవత్సరం కానుక కోసం వెయిట్‌ చేస్తున్నారు

Update: 2023-12-31 06:54 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కొత్త సంవత్సరం కానుక కోసం వెయిట్‌ చేస్తున్నారు. కొరటాల శివ కచ్చితంగా న్యూ ఇయర్ సందర్భంగా దేవర సినిమా నుంచి ఒక పోస్టర్ అయినా విడుదల చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ దేవర పోస్టర్‌ కొత్త ఏడాది కానుకగా లేనట్లే అని తేలిపోయింది.


ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరచకుండా ఎన్టీఆర్‌ కొత్త సంవత్సరం కొత్త లుక్ తో క్యాలెండర్ స్టిల్‌ ను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం విదేశాల్లో ఫ్యామిలీ తో వెకేషన్‌ లో ఉన్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కోసం అంటూ ఈ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

ఎన్టీఆర్ లుక్‌ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సూపర్ అండ్ స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్ ని చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. దేవర సినిమా పోస్టర్ రాకున్నా కూడా ఎన్టీఆర్‌ కొత్త సంవత్సర కానుకగా వచ్చిన ఈ క్యాలెండర్ స్టిల్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరిందని ఇటీవలే కళ్యాణ్‌ రామ్‌ పేర్కొన్నాడు. ఏప్రిల్ లో సినిమా వస్తుంది అంటూ యూనిట్‌ సభ్యులు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తున్న దేవర సినిమా ను రెండు పార్ట్‌ లుగా విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు కొరటాల శివ ప్రకటించాడు. దేవర తర్వాత వార్‌ 2 లో ఎన్టీఆర్‌ నటించబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Tags:    

Similar News