నగ్నంగా అమీర్ అల్లుడు అప్పుడే ఇలా!
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ అల్లుడిగా నూపురు శిఖారే ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. అమీర్ కుమార్తె ఇరా ఖాన్ తో నుపుర్ వివాహం నిన్నటి రోజున నిరాండంబరంగా జరిగింది.
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ అల్లుడిగా నూపురు శిఖారే ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. అమీర్ కుమార్తె ఇరా ఖాన్ తో నుపుర్ వివాహం నిన్నటి రోజున నిరాండంబరంగా జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకలో నుపురు నల్ల బనియన్..తెల్ల నిక్కరులో పెళ్లికి హాజరై సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. నేరుగా ప్రెండ్స్ గ్యాంగ్ తో రోడ్డుపై మార్నింగ్ రన్నింగ్ ముగించుకుని అవే దుస్తుల్లో కోర్టుకి పెళ్లికి హాజరయ్యాడు.
సమయానికి హాజరు కావాలి కాబట్టి అవే దుస్తుల్లో రిజిస్టర్ లో సంతకం చేసి అమీర్ ఖాన్ ఇంట అల్లుడు అయ్యాడు. అలాంటి దుస్తుల్లో పెళ్లికి హాజరు కావడంపై నెట్టింట ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. వివాహానికి కనీసం సంప్రదాయం కూడా పాటించుకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? అని నెటి జనులంతా మండిపడ్డారు. ఎంత సెలబ్రిటీ కల్చర్ లో పెరిగితే మాత్రం మరీ ఇంత దారుణంగా పెళ్లి చేసుకుంటాడా? అని తీవ్రంగా మండిపడ్డారు.
ఇప్పుడు అమీర్ ఇంట అల్లుడు అయ్యాడు? కాబట్టి ఇలా వైరల్ అవుతున్నాడు. కానీ నుపుర్ అమీర్ ఇంట అల్లుడు కాక ముందే తానేంటో నగ్నంగానే ప్రపంచానికి చూపించాడు? అవును అప్పుడతను పెద్దగా ఎవరికీ తెలియదు కాబట్టి పట్టించుకోలేదు గానీ! లేదంటే సీన్ వేరే లెవల్లో ఉండేది. తాజాగా నుపుర్ శిఖారే నగ్నంగా ఉన్న ఓ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఇదిగో ఇక్కడిలా నగ్నంగా జంపింగ్ చేస్తే పరుగందుకున్నాడు.
ఇది ఫోటో షూట్ కి సంబంధించింది. రన్నర్ పొజిషన్ లో ఉండి ప్రయివేట్ భాగాల్ని కవర్ చేస్తూ తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో ఇప్పటిది కాదు త్రో బ్యాక్ పిక్. కానీ ఇరాఖాన్ ని పెళ్లి చేసుకోవడంతో మళ్లీ నెట్టింట వెలుగులోకి వచ్చింది. నుపురు ఎంతటి ఘనాపాటో మరోసారి అందరికీ ఇలా గుర్తు చేస్తున్నారు నెటి జనులు. నూపూర్ శిఖారే యంగ్ ఏజ్‌లో అథ్లేట్‌గా రాణించాడు. అటుపై ఫిజికల్ ట్రైనర్ వృత్తిలో స్థిరపడ్డాడు. సుస్మిత సేన్ కి ట్రైనర్‌గా పనిచేసాడు.అ తడి పనితనం మెచ్చిన ఇరాఖాన్ కూడా పర్సనల్ ట్రైనర్ గా నియమించుకుంది. ఆ పరిచయం స్నేహం..ప్రేమ..పెళ్లిగా మారాయి.