OG vs దేవర.. గ్లింప్స్ లో ఎవరు తోపు

అంటే తెలుగు నుంచి ఈ ఏడాది ఐదుగురు స్టార్స్ పాన్ ఇండియా సినిమాలతో థియేటర్స్ లోకి రాబోతున్నారు.

Update: 2024-01-09 04:45 GMT

బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్టాండర్డ్, మార్కెట్ రెండు పెరిగాయి. కొత్త కథలతో హీరోలు పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ తమని ప్రూవ్ చేసుకుంటున్నారు. సరైన కథ పడితే అన్ని భాషలలో సత్తా చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, తారక్ లాంటి స్టార్ హీరోలు ఇండియన్ మార్కెట్ పై ప్రభావవంతమైన నటులుగా మారిపోయారు.

ఈ ఏడాది వీరందరి నుంచి పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. వీరికి అదనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జత కలిశారు. అంటే తెలుగు నుంచి ఈ ఏడాది ఐదుగురు స్టార్స్ పాన్ ఇండియా సినిమాలతో థియేటర్స్ లోకి రాబోతున్నారు. ఈ సినిమాలన్నీ దేనికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. వీటిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలకి సంబందించిన ఫస్ట్ గ్లింప్స్ లు వచ్చేశాయి.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ బట్టి కంటెంట్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోంది అనేది స్పష్టం అవుతోంది. ఎర్రసముద్రంపై దోపిడీ దొంగలని దేవర ఎలా అడ్డుకున్నాడు అనేది మెయిన్ పాయింట్ గా గ్లింప్స్ బట్టి తెలుస్తోంది. విజువలైజేషన్, మూడ్ ఆఫ్ ప్రెజెంటేషన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా ఆడియన్స్ ని మరొక ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళిపోయేలా దేవర ఉండబోతోందని అనిపిస్తోంది.

ఇక పుష్ప ది రూల్ మూవీ మీద అయితే హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతాడని భావిస్తున్నారు. ఈ మూవీ టీజర్ తోనే ఇండియన్ వైడ్ గా ట్రెండ్ క్రియేట్ చేశాడు. కచ్చితంగా పుష్పకి మించి ఈ మూవీ ఉంటుందని టీజర్ తో స్పష్టం అయ్యింది. ఇక ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రాబోయే కల్కి 2898 ఏడీ మూవీ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో భవిష్యత్తు ప్రపంచంలోకి తీసుకొని వెళ్లబోతోంది అని గ్లింప్స్ తో స్పష్టం అయ్యింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడనటువంటి కథ, ప్రపంచాన్ని ఈ మూవీలో చూడబోతున్నాం.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీతో రాబోతున్నారు. ఈ మూవీ గ్లింప్స్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉంది. గ్యాంగ్ స్టార్ ఓజాస్ గంభీరగా పవర్ విధ్వంసం చూడటం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ని ఇమేజ్ ని ఈ మూవీ నెక్స్ట్ లెవల్ కి అయితే తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ టీజర్స్ లో వేగంగా 100 కె లైక్స్ సొంతం చేసుకున్న మూవీ కూడా పవర్ స్టార్ ఓజీ కావడం విశేషం. జస్ట్ 6 నిమిషాల్లోనే ఈ మూవీ రికార్డ్ లైక్స్ సొంతం చేసుకుంది. రెండో స్థానంలో దేవర 9 నిమిషాలతో ఉంది. మూడో స్థానంలో ఆర్ఆర్ఆర్ 12 నిమిషాలతో ఉండటం గమనార్హం.

Tags:    

Similar News