హనుమాన్ : అయ్యో.. నా ఉద్దేశ్యం అది కాదు
దాంతో చాలా మందికి ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పై చాలా కోపంతో ఉన్నారు.
ఈ సంక్రాంతికి తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'హనుమాన్' సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా ను మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కు పోటీ అన్నట్లుగా విడుదల చేస్తున్నారు అంటూ కొందరు సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు తెగ ప్రచారం చేస్తున్నారు.
చిన్న సినిమా అయినా కూడా మా సినిమా లో పెద్ద స్టార్, రియల్ స్టార్ హనుమంతుడు ఉన్నాడు అంటూ మొత్తం దేవుడి మీద భారం వేసి మరీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరియు చిత్ర యూనిట్ సభ్యులు సంక్రాంతికి అది కూడా మహేష్ బాబు సినిమా విడుదల ఉన్న రోజే రిలీజ్ కు సిద్ధం అవుతున్నారు.
దాంతో చాలా మందికి ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పై చాలా కోపంతో ఉన్నారు. మా గుంటూరు కారం మొదటి రోజు వసూళ్లలో కోత పడే విధంగా హనుమాన్ ను పోటీకి తీసుకు వస్తున్నాడు అంటూ వారు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ వర్మను వారు ట్రోల్స్ చేస్తున్నారు.
తాజాగా ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హనుమాన్ హిట్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తే 'అవతార్' ను మించిన సినిమాను తీస్తాను అనే అర్థం వచ్చే విధంగా మాట్లాడాడు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా వీడియోను షేర్ చేసి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.
బాహుబలి వంటి భారీ సినిమా ను చేసిన రాజమౌళి కూడా ఎప్పుడు అవతార్ ను మించిన సినిమా ను తీస్తాను అనలేదు. అప్పుడే నువ్వు అంతకు మించి అనేసావు... నీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ ని చూస్తూ ఉంటే అతి అనిపిస్తుందని ట్రోల్స్ మొదలు అయ్యాయి.
తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శల నేపథ్యంలో వెంటనే దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించాడు. తాను అవతార్ ను మించిన సినిమా తీస్తాను అనలేదు అని, హనుమాన్ హిట్ అయితే ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అవతార్ తరహా భారీ వీఎఫ్ఎక్స్ సినిమాలు వస్తాయి అన్నట్లు తన ఉద్దేశ్యం అంటూ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి సోషల్ మీడియాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ను ఒక వర్గం నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. హనుమాన్ సినిమా కి చాలా రకాలుగా అడ్డంకులు కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ వర్మ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. విడుదలకు ఇంకా పది రోజుల సమయం ఉంది.. ఈ పది రోజుల్లో ఇంకా ఎన్ని జరుగుతాయో, ఎంత హడావిడి ఉంటుందో చూడాలి.