టాప్ డైరెక్ట‌ర్ నే రంగంలోకి దించిన న‌యా స్టార్!

అయితే ఇది మహాభారతం ఆధారంగా రాకేష్ క‌ర్ణ క‌థ‌ని సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Update: 2024-10-06 22:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాలీవుడ్ డెబ్యూ ఖ‌రారైంది. 'క‌ర్ణ' టైటిల్ తో బాలీవుడ్ లో లాంచ్ అవుతున్న‌ట్లు కొంత కాలంగా ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా విష‌యాన్ని ఐఫా వేదిక‌గా ద‌ర్శ‌కుడు ఓం ప్ర‌కాష్ మోహ్రా కాన్ప‌మ్ చేసారు. 'ఈ వార్తలు నిజమేనని, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నదని, సమయం వచ్చినప్పుడు అధికారికంగా వెల్లడిస్తానని ఓం ప్రకాశ్‌ మెహ్రా తెలిపారు.

అయితే ఇది మహాభారతం ఆధారంగా రాకేష్ క‌ర్ణ క‌థ‌ని సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం. సూర్య‌ని నెక్స్ట్ లెవ‌ల్ కి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుంద‌ని బాలీవుడ్ లో ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలంద‌ర్నీ వ‌దిలేసాని ఓం సూర్య‌ని ఎంపి చేసుకోవ‌డం ఇంట్రెస్టింగ్. ఇక సూర్య ఎలాంటి పెర్మార్మ‌ర్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. క‌ళ్ల‌తోనే న‌టించే గొప్ప న‌టుడు. ఆయ‌న క‌ళ్ల‌కే టాలీవుడ్ లో చాలా మంది హీరోలున్నారు.

పాన్ ఇండియా స్టార్లు ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, రానా ల సూర్య‌కి అతి పెద్ద అభిమానులు. అలాంటి స్టార్ నే ఓం ప్ర‌కాష్ తీసుకోవ‌డం ఇంట్రెస్టింగ్. ఈ చిత్రాన్ని 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారుట‌. ఇందులో కర్ణుడి కోణం నుంచి క‌థ ఉంటుంది..కర్ణ పాత్ర‌లోనే సూర్య న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఓం ప్ర‌కాష్ బాలీవుడ్ కి ఎలాంటి హిట్ సినిమాలు అందించారు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. రంగ్‌దే బసంతి, దిల్లీ 6, బాగ్‌ మిల్ఖా బాగ్‌, తుఫాన్‌ వంటి చిత్రాలతో గొప్ప దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్ర‌స్తుతం సూర్య 'కంగువ‌'లో న‌టిస్తున్నాడు. ఇది పీరియాడిక్ చిత్రం. అత‌డి తొలిపాన్ ఇండియా సినిమా ఇది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో హైప్ అంత కంత‌కు పెరిగిపోతుంది. ఈ చిత్రం న‌వంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

Tags:    

Similar News