OMG 2 ట్రైలర్.. ఈసారి శివుడిపై ఆట!
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో శరవేగంగా సినిమాలు చేసే స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో శరవేగంగా సినిమాలు చేసే స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. ఇక అప్పుడప్పుడు ఆయన దేవుడు సినిమాలను కూడా బాగానే చేస్తున్నారు. ఇంతకుముందు ఓ మై గాడ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న అక్షయ్ కుమార్ ఇటీవల రామసేతు సినిమాతో కూడా బాగానే హైలెట్ అయ్యాడు. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు.
ఇక ఇప్పుడు ఓ మై గాడ్ సినిమాకు ఫ్రాంచైజ్ గా మరో OMG 2 సినిమాను పేక్షకుల ముందుకు తెస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారిపోయింది. సెన్సార్ లో కూడా చాలా అభ్యంతరాలు వెలువడినట్లు తెలిసింది. ఇక ముందుగా ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ లోకి వెళితే. కథ గురించి మొత్తం ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పుణ్యక్షేత్రంలో శివ భక్తుడిగా జీవించే కాంతి ( పంకజ్ త్రిపాఠి) టీనేజ్ వయసులో ఉన్న కొడుకుని ఉన్నత చదువుల కోసం ఒక కాన్వెంట్ స్కూల్లో చేర్పిస్తాడు.
ఇక అనుకోకుండా ఒక అసభ్యకరమైన వీడియో ద్వారా అతను వైరల్ కావడంతో కాంతి పరువు పోతుంది. ఇక అతను ఎంతో భక్తితో కొలిచే శివుడిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. అంతే కాకుండా అతను దేవుడిపై రివెంజ్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఇక ఇంతలో అక్షయ్ కుమార్ శివుడు పంపిన దూతగా అతని ముందుకు వస్తాడు. అతనికి అన్ని విధాలుగా సహాయం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు.
దీంతో అసలు ఏం జరిగింది ఈ కాంతి శరణ్ ఈ గజిబిజి కన్ఫ్యూజన్ లో ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది అనేది వెండితెరపై చూడాలి అని ట్రైలర్లో కొంత ఆసక్తిని అయితే కలిగించారు. ఈ సినిమా అసలు పాయింట్ ఒక వీడియో చుట్టూ తిరుగుతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. చాలా సెన్సిటివ్ పాయింట్ తో సనాతన ధర్మం గొప్పతనానికి లింకు పెట్టారు అనిపిస్తోంది. అలాగే మతమార్పిడుల గురించి కూడా కొన్ని డైలాగులు సెన్సిటివ్ గానే ఉన్నాయి.
పంకజ్ త్రిపాఠి చాలా రోజుల తర్వాత ఊహించని ఒక భక్తుడిగా కనిపించడంతో సినిమాకు కావాల్సినంత బజ్ అయిపోతే పెరిగింది. ఇక ఎప్పటిలానే ఒక దేవుడు సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అక్షయ్ కుమార్ కనిపించబోతున్నాడు. ఓ మై గాడ్ 2 మొత్తానికి డైలాగ్స్ టీజర్ ట్రైలర్ తోనే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. అమిత్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక సెన్సార్ లోనే ఈ సినిమాకు ఏకంగా 27 కట్స్ పడ్డాయి. మరి ఈనెల 11న రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.