సోష‌ల్ మీడియాల్లో అన‌వ‌స‌రంగా దొరికిపోయిన ఓంరౌత్

కానీ కొంత గ్యాప్ త‌ర్వాత‌ ఒక గుడి నుంచి త‌న‌ ఫోటోను అత‌డు షేర్ చేసాడు

Update: 2023-07-25 04:34 GMT

ఆదిపురుష్ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నాక ఓం రౌత్ సోషల్ మీడియాల్లో కనిపించకుండా పోయారు. కానీ కొంత గ్యాప్ త‌ర్వాత‌ ఒక గుడి నుంచి త‌న‌ ఫోటోను అత‌డు షేర్ చేసాడు. గోవాలోని శ్రీ శాంతదుర్గ దేవాలయం.. శ్రీ మంగేశి దేవాలయాల‌ను సందర్శించానని అవి తన చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చాయని వెల్లడించారు. ఈ పవిత్ర స్థలాల్లో భగవంతుని ఆశీర్వాదం పొందాన‌ని వెల్ల‌డించాడు. తన మూలాలకు ఇవి క‌నెక్ట్ అయి ఉన్నాయ‌న్నాడు.

అయితే సోష‌ల్ మీడియాల్లో అన‌వ‌స‌రంగా చిక్కాన‌ని అత‌డికి కొద్దిసేటికే అర్థ‌మైంది. తమ హీరోకి ఇంత పేలవమైన సినిమా ఇచ్చినందుకు ఓం రౌత్ పై ప్ర‌భాస్ అభిమానులు దుమ్మెత్తిపోసారు.

రామాయణంతో చ‌రిత్ర సృష్టిస్తాడ‌ని అనుకుంటే ప్రభాస్ సామర్థ్యాన్ని వృధా చేసినందుకు చాలా మంది అతనిని తిట్టారు.ఇంకా ఎలా బతికి ఉన్నావు? అంటూ కొందరు ప్ర‌శ్నించారు. దేవుళ్లను ఎంత పూజించినా ఆదిపురుష్ పాపం అంత తేలిగ్గా తొలగిపోద‌ని కొందరు శ‌పించారు.

ఆదిపురుష్ చిత్రం రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కింది. రామాయ‌ణంలో పాత్ర‌ల‌ను త‌ప్పుగా చిత్రీక‌రించార‌ని ఇందులో భాష చెత్త‌గా ఉంద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ప్ర‌భాస్ శ్ర‌మ అంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అయింది. అయినా పాన్ ఇండియా స్టార్ గా ప్ర‌భాస్ కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ చిత్రం 300 కోట్లు పైగా వ‌సూలు చేయ‌గ‌లిగింది. ఇన్ని విమ‌ర్శ‌ల మ‌ధ్య ఈ వ‌సూళ్ల క్రెడిట్ నిజంగా ప్ర‌భాస్ కే చెందుతుంది.

ప్రారంభంలో బలమైన ఓపెనింగులు సాధించినా కానీ ప్ర‌తికూల సమీక్షలతో వ‌సూళ్లు దిగ‌జారాయి. ఓం రౌత్ త‌న‌ని తాను ఎంత‌గా సమర్థించుకున్నా విమ‌ర్శ‌లు ఆగ‌లేదు. నిజానికి రామానంద్- రామాయ‌ణం బుల్లితెర‌పై ఎంతో క్లాసిక్ గా తెర‌కెక్కి అల‌రించింది.

ఆదిపురుష్ పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న క్ర‌మంలోనే రామానంద్ రామాయ‌ణాన్ని తిరిగి టెలివిజ‌న్ ల‌లో టెలీకాస్ట్ చేయాల్సిందిగా ప్ర‌జ‌లు కోరారు. ఇది నిజంగా ఓంరౌత్ కి ఆక్షేప‌ణ అని చెప్పాలి. ప్ర‌భాస్ కాపాడ‌క‌పోతే నిజానికి టీసిరీస్ స‌హా నిర్మాణ సంస్థ‌లు మున‌క‌లు వేసేవే. ఏదోలా చివ‌రికి ప‌రిమిత న‌ష్టాల‌తో స‌ద‌రు సంస్థ‌లు కొంత బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగాయి.

Tags:    

Similar News