భైరవకోన బుజ్జగింపులు అయ్యాయా..?

సంక్రాంతి సినిమాల రిలీజ్ అడ్జెస్ట్మెంట్ లో నిర్మాతల మండలి అంతా కలిసి లైన్ క్లియర్ చేశారు

Update: 2024-01-28 05:32 GMT

సంక్రాంతి సినిమాల రిలీజ్ అడ్జెస్ట్మెంట్ లో నిర్మాతల మండలి అంతా కలిసి లైన్ క్లియర్ చేశారు. ఆ టైం లో ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ ఇచ్చేలా మాట్లాడుకున్నారు. సంక్రాంతికి స్కిప్ చేసిన ఈగల్ ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ వచ్చేలా నిర్మాతల మండలి ఫిక్స్ చేసింది. అయితే అదే డేట్ న రిలీజ్ అనుకున్న ఊరు పేరు భైరవకోన సినిమాను పట్టించుకోలేదు. ఆ తర్వాత చిన్నగా ఆ మూవీ టీం వచ్చి ఫిబ్రవరి 9న మా సినిమా రిలీజ్ ఇది ఫిక్స్ అని హడావిడి చేశారు.

సంక్రాంతి సినిమాల రిలీజ్ టైం లో మాట్లాడినప్పుడు భైరవ కోన మేకర్స్ ని పిలవకపోవడం వల్లే ఈ గొడవ మొదలైంది. ఫిబ్రవరి 9న భైరవ కోన రిలీజ్ లాక్ చేయగా రవితేజ ఈగల్ సినిమా కూడా అదే డేట్ న వస్తుంది. తమకు సోలో రిలీజ్ ఇస్తామన్నారు కదా అని ఈగల్ నిర్మాతలు నిర్మాతల మండలికి లెటర్ రాశారు. అటు భైరవ కోన టీం కి చెప్పలేక.. ఈగల్ నిర్మాతలను ఫేస్ చేయలేక ప్రొడ్యూసర్ కౌన్సిల్ కాస్త ఇబ్బంది పడింది.

ఈ క్రమంలో నిర్మాతల మండలి భైరవ కోన టీం తోనే బుజ్జగింపుల ప్రక్రియ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 9న వదిలేస్తే వారం తర్వత ఫిబ్రవరి 16న సోలో రిలీజ్ ఇచ్చేలా మాట్లాడుతున్నారట. ఫిబ్రవరి 16న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, గోపీచంద్ భీష్మ సినిమాలు రావాల్సింది. కానీ అవి దాదాపు వాయిదా పడినట్టే అని తెలుస్తుంది. అందుకే భైరవ కోన సినిమాకు సోలో రిలీజ్ గా ఫిబ్రవరి 16న రావాలని కోరుతున్నారట. మరి వీళ్ల రిక్వెస్ట్ కి భైరవ కోన టీం ఓకే అంటారా లేదా అన్నది చూడాలి.

ఊరు పేరు భైరవ కోన సినిమా టీం కాదు కూడదు అంటే ఈగల్ సినిమానే ఫిబ్రవరి 16న సోలోగా వచ్చేలా చేస్తారు. అయితే ఆల్రెడీ రిలీజ్ డేట్ మార్చుకున్న ఈగల్ ని రిలీజ్ డేట్ మార్చమని అడగడం కన్నా భైరవ కోన సినిమాను ఒక వారం వాయిదా వేసుకోమని నిర్మాతల మండలి ఫోర్స్ చేస్తుందట. అయితే ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం నిర్మాతలతో ఫైట్ ఎందుకని భైరవ కోన సినిమానే ఫిబ్రవరి 16న రిలీజ్ చేసేలా ఆ సినిమా దర్శక నిర్మాతలు ఓకే అన్నట్టు తెలుస్తుంది. మరి ఈ రెండు సినిమాల మధ్య ఈ రిలీజ్ ఫైట్ ఎలా సాల్వ్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News