పాక్ స‌రిహ‌ద్దులో 'వందేమాత‌రం' సాంగ్ లాంచ్

జనవరి 17న రిపబ్లిక్ డే వారంలో అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దులో ఒక పాటను విడుదల చేసిన తొలి చిత్రంగా 'ఆపరేషన్ వాలెంటైన్' చరిత్ర సృష్టించనుంది.

Update: 2024-01-15 05:09 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ద్విభాషా చిత్రంగా విడుదల కానుంది.


ఈ సినిమా పోస్ట‌ర్లు, గ్లింప్స్ కి ఇప్ప‌టికే చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌చారంలో మ‌రో ముంద‌డుగు వేస్తూ చిత్ర‌బృందం చేస్తున్న మ‌రో ప్ర‌యోగం ఆక‌ట్టుకోనుంది. జనవరి 17న రిపబ్లిక్ డే వారంలో అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దులో ఒక పాటను విడుదల చేసిన తొలి చిత్రంగా 'ఆపరేషన్ వాలెంటైన్' చరిత్ర సృష్టించనుంది. వాఘా సరిహద్దు భారతదేశం-పాకిస్తాన్ అధికారిక సరిహద్దు.. దీనిని ట్రాన్సిట్ పాయింట్ అని పిలుస్తారు. ఇక్క‌డ ప్రతిరోజూ జరిగే మార్చింగ్ రిట్రీట్ వేడుక రెండు వైపులా ఉన్న ప్రజలకు ఆనందాన్ని ఇస్తుంది. సైనికుల‌ ఈ ప్రయాణానికి ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని జోడిస్తూ 'వందేమాతరం' పాటను బార్డ‌ర్ లో విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో అనురాగ్ కులకర్ణి ఈ పాట‌ను ఆల‌పించ‌గా, హిందీలో పాపుల‌ర్ గాయ‌కుడు సుఖ్‌విందర్ సింగ్ ఆల‌పించారు. మిక్కీ J. మేయర్ సంగీతం అందించారు.

ఇంత‌కుముందు ఆప‌రేష‌న్ వాలెంటైన్ నుంచి విడుదలైన ఫస్ట్ స్ట్రైక్ వీడియో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ప్ర‌చార‌ఫ‌ర్వాన్ని కొత్త ఎత్తులకు చేర్చింది ఈ వీడియో. నిస్సందేహంగా 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు పెంచేలా పాట‌లు ఉండ‌బోతున్నాయి. త‌దుప‌రి 'వందేమాతరం' సాంగ్ ని బార్డ‌ర్ లో రిలీజ్ చేయ‌డం కూడా ఉత్కంఠ‌ను పెంచుతోంది.

Tags:    

Similar News