నాటి భారతప్రధాని నెహ్రూతో ఓపెన్‌హైమర్ సీక్రెట్ మంతనాలు!
ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో కమ్యూనికేట్ చేయడానికి ఓపెన్‌హైమర్ ప్రయత్నించాడు.
దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చరిత్ర లోని అత్యంత వివాదాస్పద వ్యక్తులలో ఒకరైన ఓపెన్‌హైమర్ జీవితకథ పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబ్ ని తయారు చేసిన రాబర్ట్.జె.ఓపెన్ హైమర్ జీవితకథతో ఓపెన్ హైమర్ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఓపెన్‌హైమర్ 1940లలో మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించాడు. ఇది ప్రపంచం లోని మొట్టమొదటి అణు బాంబు సృష్టికి దారితీసింది. జపాన్ లోని హిరోషిమా నాగసాకి నగరాల పై రెండు బాంబులు వేసిన తర్వాత అతను అనుభవించిన వ్యథ అపరాధం గురించి ఓపెన్‌హైమర్ తరచుగా మాట్లాడుతుండేవాడు. అతడు అణుశక్తి నియంత్రణ కోసం తన మిగిలిన రోజులను అంకితం చేశాడు. హైడ్రోజన్ బాంబు తయారీ లో పాల్గొనడానికి అతను నిరాకరించాడు. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని తన ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఇతివృత్తాలు నోలన్ చిత్రం లో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇది అపరాధ భావంతో నిండిన ఒపెన్‌హైమర్ మనసు ను ఆవిష్కరిస్తుంది.
ప్రముఖ రచయిత్రి నయనతార సహగల్ అందించిన వివరాల ప్రకారం.. "అణు బాంబు కంటే చాలా ఘోరమైన ఆయుధాన్ని తయారు చేయడానికి US ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో కమ్యూనికేట్ చేయడానికి ఓపెన్‌హైమర్ ప్రయత్నించాడు. ఆ సమయంలో భారతదేశానికి అవసరమైన గోధుమల కు బదులుగా అమెరికన్లతో ముఖ్యంగా థోరియం వ్యాపారం చేయవద్దని నెహ్రూని వేడుకున్నాడు. నెహ్రూ మేనకోడలు అయిన సహగల్ తన పుస్తకం Nehru: Civilizing A Savage Worldలో 1951లో మాస్కో, వాషింగ్టన్, లండన్‌లలో భారత రాయబారిగా పనిచేసిన ఆమె తల్లి (నెహ్రూ సోదరి) విజయ లక్ష్మి పండిట్ నుండి వచ్చిన లేఖను బహిర్గతం చేసారు.
ఆ లేఖ లో ప్రిన్స్‌టన్ నుండి తనను రప్పించిన ఒపెన్‌హైమర్‌తో తాను జరిపిన సంభాషణ గురించి అతనికి చెప్పింది. 'అణు బాంబు కంటే చాలా ఘోరమైన ఆయుధాన్ని యునైటెడ్ స్టేట్స్ అభివృద్ధి చేస్తోంద ని చిల్లింగ్ మెసేజ్'ను విజయలక్ష్మి పండిట్ తీసుకొచ్చారు. అయితే ఈ ప్రయత్నం సక్సెస్ కావాలంటే భారతదేశం లో తరగని గని అయిన థోరియంకు US యాక్సెస్ అవసరం.
బదులుగా అమెరికా మన దేశానికి గోధుమలను అందించడానికి సిద్ధంగా ఉంది. అమెరికా కు స్వచ్ఛందంగా లేదా ఒత్తిడి ద్వారా ఎలాంటి థోరియంను విక్రయించవద్దని ఓపెన్ హైమర్ భారతదేశాన్ని వేడుకున్నాడు. అయితే నెహ్రూ 'అణ్వాయుధాల ను అసహ్యించుకుని వాటి మొత్తం నిర్మూలన కోసం ఉద్వేగభరితంగా ప్రయత్నించాడు' కాబట్టి నెహ్రూ ఆ తప్పును చేయలేదు.
హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ హైమర్ జీవితచరిత్ర సహరచయిత కై బర్డ్ మాట్లాడుతూ.. సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ కు 1954లో నెహ్రూ భారత పౌరసత్వాన్ని అందించారని అయితే అతను దృఢమైన దేశభక్తుడు కాబట్టి దానిని సీరియస్ గా తీసుకోలేదని చెప్పాడు. ఓపెన్ హైమర్ తన సొంత ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చేందుకు నిరాకరించిన తర్వాత అతని పై జరిపిన మంత్రగత్తె వేటను ఓపెన్ హైమర్ చిత్రం లో నోలన్ విస్తృతంగా చూపించారు. ఇప్పటికే భారతదేశం లో 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇక్కడ మంచి విజయాన్ని అందుకుంది.