ఒక్కో ఈవెంట్‌కి 30లక్షలు లాగేస్తున్న ఓర్రీ!
ఇటీవలి ప్రకటనలో ఓర్రీ ఒక ఈవెంట్‌కు హాజరు కావడానికి ఫీజుగా రూ. 20 నుండి 30 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు కథనాలొస్తున్నాయి.
స్టార్ కిడ్స్‌తో నైట్ పార్టీల్లో సందడి చేసే ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి పరిచయం అవసరం లేదు. నైసా దేవగన్, సుహానాఖాన్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, సానయ సహా నేటితరం కథానాయికలకు ఎంతో సన్నిహితుడు. అతడు లేనిదే పార్టీ లేదు. ఈవెంట్లలో క్రౌడ్ పుల్లర్ ఓర్రీ. బాలీవుడ్ సెలబ్రిటీ ప్రపంచంలోకి సడెన్ గా దూసుకొచ్చిన ఈ ఓర్రీ ఎవరు? అంటూ ఆరాలు తీస్తే అతడు రిలయన్స్ అంబానీల కంపెనీలో ఒక ఉద్యోగి అని తేలింది చివరికి. అంబానీల కంపెనీలో మేనేజ్ మెంట్ గురూగా పని చేస్తున్నాడు. ప్రతిభావంతుడు. అంబానీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నాడు. ఇది అతడి ఇమేజ్ ని అమాంతం పెంచింది. అయితే నైట్ పార్టీల్లో నిరంతరం గాళ్స్ తో చిల్ చేసే అతడికి ప్రత్యేకించి ఫాలోయింగ్ ఏర్పడింది.
ఓర్రీ పేరుతో ప్రస్తుతం బాలీవుడ్ సామాజిక వర్గాలు బోలెడంత సందడి చేస్తున్నాయి. అతడు నటుడు కానప్పటికీ బాలీవుడ్‌లో సగం మందితో బాగా కనెక్ట్ అయి ఉన్నాడు. దేశీ ఛాయాచిత్రకారుల సోషల్ మీడియా ఖాతాలలో ఆధిపత్యం సాధించాడు. ఓర్రీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం అతడు RIL చైర్‌పర్సన్స్ కార్యాలయంలో ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజర్. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 17 హౌస్‌లోకి ప్రవేశించిన తర్వాత ఓర్రీ మరింతగా హెడ్ లైన్స్ లోకి వచ్చాడు.
ఇటీవలి ప్రకటనలో ఓర్రీ ఒక ఈవెంట్‌కు హాజరు కావడానికి ఫీజుగా రూ. 20 నుండి 30 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు కథనాలొస్తున్నాయి. సెలబ్రిటీలు వచ్చి ప్రదర్శనలు ఇచ్చి వెళ్లిపోతే తన వ్యవహారశైలి భిన్నంగా ఉంటుందని వివరించారు. ఓరీ ప్రెజెన్స్ ఖరీదైనది. అతడు మొత్తం పార్టీ కోసం ఉంటాడు, స్నేహితుడిలా అందరితో కలిసిపోతాడు. అతిథులందరితో ఫోటోలు తీసుకుంటాడు... ఇది అతడి వ్యాపారాన్ని ఆదాయాన్ని పెంచుతోంది అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి ఓరీ చాలా ఛమత్కారంగా స్పందించాడు.
అతడు ఇలా అన్నాడు. ``ప్రజలు నన్ను వారి ఫామ్‌హౌస్‌లకు పిలిచి, మా నాన్న, అమ్మ మా అత్తమామలు అందరూ ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, నా భార్య - నేను రూ.2.5 లక్షలు వేస్తాము.. అంటే మొత్తం 25 లక్షలు మీ ప్యాకేజీ.. దయచేసి రండి మా పార్టీకి`` అంటారు అంటూ వ్యంగ్యంగా స్పందించాడు.
భామలతో ఫోటోషూట్లు:
హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఓర్రీ తనను తాను `లివర్` అని ఎందుకు పిలుస్తాడో వివరించాడు. స్టార్ కిడ్ షానాయ కపూర్‌తో సంభాషణ తర్వాత దానిని కనుగొన్నట్లు చెప్పాడు. ఓర్రీ మాట్లాడుతూ, తాను ఒకసారి షనాయకు కాల్ చేసినప్పుడు, ఆమె కాల్ కట్ చేసిందని, కాల్ పిక్ చేయమని అతను ఆమెకు మెసేజ్ చేసినప్పుడు, తాను షూట్ మధ్యలో ఉన్నానని షానయ అతనికి చెప్పిందట. అయితే తాను కూడా పని చేస్తున్నానని చెప్పినప్పుడు షానయ ఇలా అంది. ``ఓరీ.. నేను మీ ఇన్‌స్టా స్టోరీలను చూస్తున్నాను. మీరు పని చేయడం లేదు.. జీవిస్తున్నారు`` అని కామెంట్ చేసింది. ఓరి దీనికి ఇలా అన్నాడు. ``అదే నేను గ్రహించాను... అవును, ఆమె సెట్‌లో ఉంది.. ఆమె నటిస్తోంది, ఆమె ఒక నటి. నేను బ్రతుకుతున్నాను.. నేను ఒక కాలేయం.. ఈ క్షణం ఆహా అనిపించింది`` అని అన్నాడు.
ఓర్రీ నిరంతరం లైమ్ లైట్ లో ఉండటానికి కారణం ముంబై ఫోటోగ్రాఫర్లు. వారివల్లనే పాపులరయ్యాడు. అయితే ఓర్రీ మీడియాను తెలివిగా ఉపయోగించుకుంటాడు. ఒకప్పుడు భూమి పెడ్నేకర్, ఆమె సోదరి సమీక్షతో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు మీడియా ఎక్కడికక్కడే ఉండేదని ఓర్రీ చెప్పాడు. మీడియాను ఎవరు పిలిచారని ఓర్రీ సరదాగా వారిని అడిగారు. వారిద్దరూ తాము కాదని అన్నారు. అప్పుడు ఒప్పుకున్నాడు ఓర్రీ.. అది నేనే! అని చెప్పాడు. అంటే మీడియాకి కబురు పెట్టింది ఓరీ అన్నమాట. మనం వారికి కాల్ చేసినా, చేయకపోయినా, ఏదో ఒక సమయంలో క్లిక్ మనిపిస్తారు. కాబట్టి వారికి కాల్ చేయడం తప్పు అనిపించలేదు. నేను దాని గురించి చాలా ఓపెన్ గా ఉన్నాను అని చెప్పాడు.