డ్రగ్స్‌లో పట్టబడిన ఆస్కార్ మూవీ నటుడు
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ అందుకున్న పారాసైట్ సినిమాలో నటించాడు అతడు.
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ అందుకున్న పారాసైట్ సినిమాలో నటించాడు అతడు. కానీ ఇప్పుడు మాదకద్రవ్యాల వినియోగం కేసులో పట్టుబడ్డాడు. అతడిని నార్కోటిక్స్ అధికారులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
నార్కోటిక్స్ నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించి చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలను ఉపయోగించారనే ఆరోపణలపై నటుడు లీ సన్-క్యున్ అరెస్టయ్యాడు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు పశ్చిమాన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంచియాన్‌లోని ఇంచియాన్ నాన్‌హియోన్ పోలీస్ స్టేషన్‌లో అతడు కనిపించాడు. తాజా కథనాల ప్రకారం, ఇంచియాన్ మెట్రోపాలిటన్ పోలీస్ ఏజెన్సీ డ్రగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం అతని మూత్రం, వెంట్రుకల నమూనాపై సంక్షిప్త రియాజెంట్ పరీక్షను నిర్వహించిందని, ఫలితం ప్రతికూలంగా ఉందని తెలిసింది. కానీ అటువంటి పరీక్ష ఫలితం కచ్చితత్వం లోపించే అవకాశం ఉన్నందున, నమూనాను నేషనల్ ఫోరెన్సిక్ సర్వీస్‌కు పంపాలని ఏజెన్సీ యోచిస్తోంది. డ్రగ్ వినియోగదారులు పరీక్షకు ఐదు లేదా పది రోజుల ముందు నార్కోటిక్స్ వాడితే పాజిటివ్ అని తేల్తుంది. అయితే చాలా కాలం ముందు డ్రగ్స్ వాడకం విషయంలో కచ్చితమైన ఫలితం పొందడం కష్టం.
ఫోరెన్సిక్ సర్వీస్ డ్రగ్ టెస్ట్ ఫలితాలు రావడానికి సుమారు ఒక నెల సమయం పడుతుంది అని ఒక విచార అధికారి తెలిపారు. తగిన పరీక్షలు చేయించుకున్న తర్వాత స్టేషన్ నుంచి సదరు నటుడు బయటకు వెళ్లిపోయాడు. నటుడు లీ సన్ క్యూన్ తన ఫోన్‌ను విచారణ కోసం సమర్పించానని, పరిశోధనలో శ్రద్ధగా పాల్గొనడం కొనసాగిస్తానని ప్రకటించారు.
గత నెలలో గంగ్నమ్ నైట్‌క్లబ్‌లలో అక్రమ మాదకద్రవ్యాల చెలామణి గురించి విచారణలో భాగంగా పోలీసులు నటుడు లీ సన్ ని అనుమానించారు. K-పాప్ గ్రూప్ బిగ్ బ్యాంగ్ G-డ్రాగన్ కూడా అనుమానిత మాదకద్రవ్యాల వినియోగదారుల జాబితాలో ఉన్నాడు. డ్రగ్ ని విడిగా బుక్ చేసాడని చెబుతున్నారు. అయితే రాపర్ కం గాయకుడు డ్రాగన్ ఆరోపణలను ఖండించారు. ఇటీవలి ప్రకటనలో పోలీసు విచారణకు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
లీ సన్ క్యున్ దక్షిణ కొరియా నటుడు. అతడు హెల్ప్ లెస్, ఆల్ అబౌట్ మై వైఫ్, ఎ హార్డ్ డే వంటి చిత్రాలలో తన పాత్రలతో పాపులరయ్యాడు. అతడు బాంగ్ జూన్-హో అకాడమీ అవార్డు-విజేత బ్లాక్ కామెడీ చిత్రం `పారాసైట్`లో నటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆ సినిమాలో నటనకు గాను.. అతడు తన కాస్ట్‌మేట్స్‌తో పాటు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులను గెలుచుకున్నాడు. అతడు తన నటనకు అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు నామినేట్ అవ్వడమే గాక..అనేక ప్రశంసలు అందుకున్నాడు.