ఓటీటీలో అడల్ట్ కంటెంట్.. అడ్డుకట్ట వేయడం ఎలా..?
రీసెంట్ గా వచ్చిన కాలేజీ రొమాన్స్ అనే వెబ్ సీరీస్ లో అశ్లీలతను హైకోర్టు తీవ్రంగా విమర్శించింది.
కేవలం వెండితెర మీద వేసే బొమ్మలకే సెన్సార్ అనేది ఉండటం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఓటీటీ వాడకం పెరిగిన తర్వాత అడల్ట్ కంటెంట్ కి అడ్డు కట్ట వేయలేకపోతున్నారు. కొన్ని సినిమాలైతే మరీ దారుణంగా కంటెంట్ ని అందిస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ పేరుతో అడల్ట్ డోస్ పెంచుతూ వస్తున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల మీద భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు నుంచి అడల్ట్ కంటెంట్, అడల్ట్ టాక్ కు సంబంధించిన కంట్రోలింగ్ కి హామీని అందుకున్నారు.
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల మీద నియమ నిబంధనలు పెట్టేందుకు రెడీగా ఉందని కోర్ట్ కి తెలియచేశారు. సోషల్ మీడియా, ఓటీటీ ఫ్లాట్ ఫాంలలో అడల్ట్ కంటెంట్ ను నియంత్రించడానికి కచ్చితమైన నియమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కోర్టు గతంలో చెప్పింది. ముఖ్యంగా చిన్న పిల్లలు అసభ్య పదజాలానికి గురి కావడాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని నియంత్రణ చేయాలని చూస్తున్నారు.
రీసెంట్ గా వచ్చిన కాలేజీ రొమాన్స్ అనే వెబ్ సీరీస్ లో అశ్లీలతను హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. మహిళలను కించపరిచేలా భాష, వారిని ఒక సెక్స్ వస్తువులుగా పరిగణిస్తున్న తీరుని కోర్టు తప్పుబట్టింది. అయితే మార్చిలోనే ఈ వెబ్ సీరీస్ మేకర్స్ ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. అయితే అందులో అరెస్టు చేయమని ఉత్తర్వులు లేవని కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియా, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల కంటెంట్ నియంత్రణకు పెద్ద సవాలుగా తీసుకున్నారు.
ప్రభుత్వం ఇలాంటి వెబ్ సీరీస్ లు, టీవీ షోలపై సీరియస్ యాక్షన్ తీసుకునేలా ప్రణాళిక తీసుకురావాలని అసభ్య పదజాలం అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా సురక్షితంగా ఆన్ లైన్ లో కంటెంట్ ఉండేలా చూడాలని ప్లానింగ్ లో ఉన్నారు.
ఓటీటీ సోషల్ మీడియా కంటెంట్ లకు సెన్సార్ చేయడం అన్నది సాధ్యం కాని పని. అయితే అలాంటి కంటెంట్ ఉండకూడదని కట్టుదిట్టమైన రూల్స్ తెస్తే ఎవరైనా దాన్ని అతిక్రమించి అడల్ట్ కంటెంట్ పెడితే వారికి తక్షణమే శిక్ష పడేలా చేస్తే మాత్రం కొంతమేరకు ఇది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే సినిమాలకు సెన్సార్ అంటే ఓకే కానీ ఓటీటీలకు సెన్సార్ ఏంటి అనే వారు కూడా ఉన్నారు. మరి ఈ ఓటీటీ, సోషల్ మీడియా కంటెంట్ పై ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.