ఒటీటీ కొత్త రూల్ తో ఆ సినిమాలపై ఎఫెక్ట్

హిట్ అయితే నాలుగు వారల తర్వాత రిలీజ్ చేయడానికి, ఒక వేళ ఫ్లాప్ అయితే మాత్రం రెండు వారాలు

Update: 2023-11-07 07:47 GMT

సంక్రాంతి రేసులో వచ్చే ఏడాది ఏకంగా ఆరు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా వేటికవే ప్రత్యేకం. అలాగే ఎవరూ కూడా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కచ్చితంగా అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం ఖాయం అని నిర్మాతల నుంచి వినిపిస్తోన్న మాట. నిర్మాతలు ఎందుకు ఇంత కచ్చితంగా ఉన్నారనేది ఎవరికి అర్ధం కాని విషయం.

ఇదిలా ఉంటే ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు నిర్మాతలకి కొత్త రూల్ తో షాక్ ఇచ్చాయి. సంక్రాంతి సమయంలో వచ్చే సినిమాలు హిట్ అయితే నాలుగు వారల తర్వాత రిలీజ్ చేయడానికి, ఒక వేళ ఫ్లాప్ అయితే మాత్రం రెండు వారాలు పూర్తయిన వెంటనే ఒటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటేనే డిజిటల్ రైట్స్ తీసుకుంటాం అని కండిషన్స్ పెట్టాయంట.

ఇక తప్పనిసరి పరిస్థితిలో నిర్మాతలు కూడా ఈ కండిషన్ కి ఒకే చెప్పి సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన 8 వరాల తర్వాత మాత్రమే ఒటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఒటీటీ సంస్థలు పెట్టిన 2 నుంచి 4 వరాల గ్యాప్ కి ఓకే చెప్పేశారు.

దీనికి కారణం కూడా ఉంది. ముందే డిజిటల్ ఒప్పందాలు జరిగిన కూడా సినిమా ఫ్లాప్ అయితే ఆనుకున్న ధర కంటే 30 నుంచి 40 శాతం కట్ చేసి నిర్మాతలకి ఇస్తున్నారంట. ఈ కారణంగానే నిర్మాతలు కూడా సేఫ్ జోన్ లో ఆలోచించి సంక్రాంతి సినిమాల వరకు ఒటీటీ కంపెనీలు పెట్టిన నిబంధనలకి ఒప్పుకున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

ఒక వేళ ఈ నిబంధన అన్ని సినిమాలకి అమలు చేస్తే మాత్రం కచ్చితంగా థియేటర్స్ లో జరిగే సినిమా బిజినెస్ మీద ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఒటీటీల కారణంగా థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే థియేటర్స్ కి ప్రేక్షకులు వెళ్లి సినిమా చూస్తున్నారు. ఎవరేజ్ టాక్ వచ్చిన కూడా ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడంలో ఫెయిల్ అవుతోంది. మరి ఈ కొత్త నిబంధన ఫ్యూచర్ లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి.

Tags:    

Similar News