డిసెంబర్ 31న ఎన్ని ఓయో రూమ్స్ బుక్ అయ్యాయో తెలిస్తే షాక్
ఇక డిసెంబర్ 31న స్విగ్గీ డెలివరీ యాప్ ద్వారా ఏకంగా ఐదు వేలకు పైగా కండోమ్ ప్యాకెట్స్ బుక్ అయ్యాయి.
2024 సంవత్సరం పోయి 2025 సంవత్సరం వచ్చింది. న్యూ ఇయర్ పార్టీ పేరుతో డిసెంబర్ 31న దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీలు జరిగాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 31వ తేదీ రూ.400 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగిన విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా ఈ నెంబర్‌ని ఊహించుకుంటేనే షాకింగ్‌గా ఉంది. ఇక డిసెంబర్ 31న స్విగ్గీ డెలివరీ యాప్ ద్వారా ఏకంగా ఐదు వేలకు పైగా కండోమ్ ప్యాకెట్స్ బుక్ అయ్యాయి. ఇది రికార్డ్ అంటూ స్విగ్గీ సంస్థ ప్రకటించింది. కొత్త సంవత్సరం సందర్భంగా మరో రికార్డ్ నమోదు అయ్యింది. డిసెంబర్ 31న దేశ వ్యాప్తంగా 10 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా ఓయో సంస్థ ప్రకటించింది.
ఓయో సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 31వ తారీకు సాయంత్రం నుంచి మొదలుకుని మధ్యరాత్రి దాటిన తర్వాత కూడా అంటే దాదాపు 2 గంటల వరకు ఓయో యాప్ ద్వారా 10 లక్షల మంది బుక్ చేశారు. ఓయో రూమ్స్ బుకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఓయో రూమ్స్ ఉండేవి కాదు. హోటల్స్‌కి ఫ్యామిలీస్ సైతం వెళ్లే వీలు ఉండేది. కానీ ఇప్పుడు ఓయో రూమ్స్ వచ్చిన తర్వాత అలాంటి హోటల్స్ వైపు కనీసం ఫ్యామిలీ జనాలు చూసే పరిస్థితి లేదు. ఓయో అనేది ఒక బూతుగా మారింది పూర్తిగా అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడేందుకు ఓయో రూమ్స్‌ని వినియోగిస్తున్న వారు అధికంగా ఉన్నారు.
కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్‌ను తమ లవర్ లేదా అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియురాలితో జరుపుకోవాలి అనుకున్న వారు రహస్యంగా ఉంటుందని ఓయో రూమ్స్‌ను బుక్ చేసుకుని ఉంటారు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక్క రాత్రిలో పది లక్షల రూమ్స్ బుక్ అయ్యాయి అంటే ఏ స్థాయిలో న్యూ ఇయర్ పార్టీని లవర్స్ జరుపుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కొత్త సంవత్సరం వేడుక పేరుతో ఇలాంటి అసాంఘీక కార్యక్రమాలు, ఇల్లీగర్ వ్యవహారాలకు పాల్పడిన వారు ఇంత మంది ఉన్నారు.
పోలీసులు ఒకప్పుడు లాడ్జ్‌లు హోటల్స్ పై రైడ్ చేసే వారు. ఇప్పుడు ఓయో రూమ్స్ ఎక్కువ కావడంతో పోలీసులు సెర్చ్ ఎక్కువ చేయడం సాధ్యం కావడం లేదు. ఒకటి రెండు అంటే చేస్తారు, వందలు వేలు ఉన్న హోటల్స్‌ను ఎలా చేస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారు చెప్పుకొచ్చారు. ఓయో రూమ్స్ పేరుతో ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే కొన్ని చోట్ల అయినా సోదాలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ముందు ముందు ఓయో రూమ్స్ మరింత విచ్చల విడిగా యువత చెడిపోవడానికి కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి.