ఛార్జీలకు డబ్బుల్లేవ్.. పద్మశ్రీ పోస్టులో పంపండి.. కవి వేదన!
అయినప్పటికీ వారు ఎప్పటికీ తాము నమ్మిన సిద్ధాంతాన్ని కళను వదిలిపెట్టరు.
మన జీవితంలో మనం చాలా మందిని చూస్తుంటాము. సంఘంలో ఎన్నో కేటగిరీల మనుషులుంటారు. కొందరు నోటిలో వెండి చెంచాతో జన్మించిన వారు ఉన్నారు. మరికొందరు తీవ్రమైన పేదరికంలో పుట్టి చివరి శ్వాస వరకు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారు. అయినప్పటికీ వారు ఎప్పటికీ తాము నమ్మిన సిద్ధాంతాన్ని కళను వదిలిపెట్టరు. వారి సంకల్పం, కృషి సమాజానికి చేసిన సహకారం ద్వారా మన మనస్సులలో చెరగని ముద్ర వేస్తారు.
అలాంటి వ్యక్తి ఒడిసాకు చెందిన హల్ధర్ నాగ్. చాలా తక్కువ వయస్సులో పాఠశాలకు వెళ్లి.. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి.. జీవనోపాధి కోసం చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ కవిగాను జీవించారు.`రాగ చన` (మసాలా చిక్‌పీస్) అమ్మే వ్యక్తి ఒక కవిగా చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు పొందాడు. 2016లో ఒడియా సాహిత్య రంగంలో అతడు ఒక సంచలనం.
అత్యంత పేదవాడైన అతడికి ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించినా తనకు దిల్లీ వెళ్లి ఆ పురస్కారాన్ని తీసుకునేందుకు డబ్బులు లేవని, పోస్టులో దానిని పంపాలని కోరిన ఒక వీడియో అంతర్జాలంలో సెన్సేషనల్ అయింది. ఆయనకు కేవలం మూడు జతల బట్టలు, ఒక కాడలు లేని కళ్లజోడు, రూ.732 లు మాత్రమే తనతో ఉన్నాయి పద్మశ్రీ దక్కిన సమయంలో.
నాగ్ రచనా ప్రతిభ అనన్య సామాన్యం. ఆయన రచనలో విస్తారమైన పద్యాలు, 20 ఇతిహాసాలు ఉన్నాయి. ఇవన్నీ అతడు ఎంతో జ్ఞాపకంగా పఠించగలడు. కంఠస్థం వచ్చేసినవి ఇవన్నీ. ఈ అద్భుతమైన ఫీట్ అతడి అంకితభావాన్ని రచనలపై అతడి ప్రేమకు నిదర్శనం. సాహిత్యానికి ఆయన చేసిన కృషిని సంబల్‌పూర్ విశ్వవిద్యాలయం కూడా గుర్తించింది. అతడి రచనల సేకరణతో `హల్ధర్ గ్రంథావళి2 ని వారి పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయించింది.
అతనికి అధికారిక విద్య లేకపోయినా, నాగ్ కవిత్వం మానవ స్వభావం, సామాజిక సమస్యలు , గ్రామీణ జీవితం లోని అందం గురించి లోతైన విషయాలను ప్రతిబింబిస్తుంది. కోస్లీ భాష, సంస్కృతిని ప్రోత్సహించడంలో పరిరక్షించడంలో అతడి రచనలు కీలక పాత్ర పోషించాయి. అతడి రచనలను అకడమిక్ పాఠ్యాంశాల్లో చేర్చాలనే నిర్ణయం నిస్సందేహంగా భవిష్యత్ తరాలకు అతని వారసత్వాన్ని అందించే ప్రయత్నం.
2016లో పద్మశ్రీతో నాగ్ గుర్తింపు పొందడం సాహిత్యంలో అతడి ప్రతిభకు.. సాంస్కృతిక సహకారానికి గొప్ప గుర్తింపు. ఈ అవార్డు ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను.. భారతదేశంలోని అంతగా పట్టించుకోని గొప్ప సాహిత్య సంప్రదాయాలకు గుర్తింపునిచ్చింది. ఇది ఒకరి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా నిజమైన ప్రతిభ, అంకితభావానికి గుర్తింపుగా భావించాలి. హల్ధర్ నాగ్‌ను గౌరవిస్తూ పద్మ పురస్కారాల సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఇది అతడ వ్యక్తిగత విజయాలు మాత్రమే కాకుండా ఒడిషా శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునేందుకు ఆస్కారం కల్పించింది.