పెయిడ్ చీవాట్ల‌పై న‌టుడి ఆవేద‌న‌

ఈ ఎపిసోడ్ లో న‌టుడు మ‌రెవ‌రో కాదు.. అత‌డు విజ‌య్ వ‌ర్మ‌. సౌత్ అగ్ర క‌థానాయిక త‌మ‌న్నాతో ప్రేమ‌లో ఉన్నాడు.

Update: 2024-10-20 21:30 GMT

ఇటీవ‌ల ప్ర‌ముఖ క‌థానాయిక‌తో ఈ న‌టుడి పేరు లింక‌ప్ అయి వార్త‌ల్లో వినిపిస్తోంది. ఒక సాధార‌ణ న‌టుడిగా, ఔట్ సైడ‌ర్ గా చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశించి త‌న‌దైన ప్ర‌తిభ‌, చొర‌వ‌తో అసాధార‌ణంగా ఎదిగేసిన ఈ స్టార్ త‌న‌పై పెయిడ్ ఆన్ లైన్ ట్రోలింగ్ జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసాడు. ఈ ఎపిసోడ్ లో న‌టుడు మ‌రెవ‌రో కాదు.. అత‌డు విజ‌య్ వ‌ర్మ‌. సౌత్ అగ్ర క‌థానాయిక త‌మ‌న్నాతో ప్రేమ‌లో ఉన్నాడు.

విజయ్ వర్మ ఇటీవల ఇంటర్నెట్ ట్రోలింగ్, నటీనటులపై ప్రతికూల వ్యాఖ్యల ప్రభావం గురించి మాట్లాడారు. అతడు తాను ఎదుర్కొన్న విధానం గురించి తెలిపాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ట్రోలింగ్ కోసం కొంద‌రికి డ‌బ్బు ముడుతుంద‌ని పేర్కొన్నాడు. ఇలాంటి పద్ధతులు అంతం కావాల‌ని కోరారు. నన్ను చాలా బాధపెట్టేది ఏమిటంటే ఈ వ్యాఖ్యలు నిజమని అమాయక ప్రజలు అనుకోవచ్చు. కానీ వాటిలో కొన్ని చాలా ప్రేరేపించి చేసేవి.. డ‌బ్బు చెల్లింపులు చేసిన‌వి. ఇది అతిపెద్ద షాక్. ఇలాంటిది నిజంగా పరిష్కరించాల్సిన విషయం. ఇంతకుముందు ఒక సినిమా విడుదలైనప్పుడు ప్రజలు దాని గురించి మాట్లాడుకునేవారు..దాని గురించి స్నేహితులు కూడా వాదించేవారు. కానీ అప్పట్లో అభిప్రాయాలను వినిపించడానికి వేదిక లేదు. కానీ ఇప్పుడు, మనం సోష‌ల్ మీడియా కాలంలో జీవిస్తున్నాం. ప్రజలు ఏం చెప్పాలనుకున్నా చెబుతారు. మేము దాని గురించి ఏమీ చేయలేము. కానీ దానితో ద్రవ్య అనుబంధం ఉన్న దానిని అరికట్టాలి.. అని వ‌ర్మ కోరారు.

అనుభవ్ సిన్హా క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ IC 814: ది కాందహార్ హైజాక్ లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న వ‌ర్మ త‌దుప‌రి ప్రాజెక్టుల‌తో బిజీ అయ్యారు. విజ‌య్ వర్మ 2012లో చిట్టగాంగ్‌తో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. తర్వాత అతడు పింక్, మాన్‌సూన్ షూటౌట్, గల్లీ బాయ్, సూపర్ 30 వంటి సినిమాల్లో నటించాడు. 2019లో డార్లింగ్స్ 2022, లస్ట్ స్టోరీస్ 2, జానే జాన్, మర్డర్ ముబారక్‌లలో నెగటివ్ పాత్రలో కనిపించాడు. తదుపరి తమిళ చిత్రం `సూర్య 43`లో న‌టించ‌నున్నాడు. గతంలో సూరరై పొట్రు చిత్రానికి దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫహద్ కూడా నటిస్తున్నారు.

Tags:    

Similar News