భార్యను గొప్పగా ప్రమోట్ చేస్తున్న డైరెక్టర్
తాజా పోస్ట్‌లో అగ్నిహోత్రి ఇలా రాశాడు. ''3 సార్లు జాతీయ అవార్డు గ్రహీత పల్లవి జోషి (డా.) ప్రియా అబ్రహం ( నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్) పాత్రలో నటించారు.
'ది వ్యాక్సిన్ వార్' గ్లోబల్ ప్రీమియర్‌కి కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రతిభావంతురాలైన నటి పల్లవి జోషి గ్రిప్పింగ్ వీడియోతో ప్రచారంలో హీట్ పెంచారు. ఒక విధంగా ఆయన భార్య (పల్లవి జోషి) పాత్రను ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రంలో పల్లవి జోషి పాత్రను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఒక ముఖ్యమైన ప్రకటన విడుదలచేశారు. వివేక్ ఈ చిత్రంలో పల్లవి లుక్‌ని ప్రకటించడానికి మైక్రోబ్లాగింగ్ సైట్ X(ట్విట్టర్)లో అద్భుత స్పందనలు వచ్చాయి.
తాజా పోస్ట్‌లో అగ్నిహోత్రి ఇలా రాశాడు. ''3 సార్లు జాతీయ అవార్డు గ్రహీత పల్లవి జోషి (డా.) ప్రియా అబ్రహం ( నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్) పాత్రలో నటించారు. భారతీయుల హృదయాన్ని హత్తుకునే ప్రదర్శనలలో ఇది ఒకటి. సినిమా విడుదలకు మిగిలిన సమయం ఇంకా 6 రోజులు! #ది వ్యాక్సిన్ వార్ #A ట్రూస్టోరి 28 సెప్టెంబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. అని వెల్లడించారు.
మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న ప్రఖ్యాత నటి పల్లవి జోషి .. వివేక్ అగ్నిహోత్రికి భార్య అన్న సంగతి తెలిసినదే. ది వ్యాక్సిన్ వార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ డాక్టర్ ప్రియా అబ్రహం పాత్రను పోషించారు. తాజా ప్రకటన అభిమానులు, సినీప్రియుల్లో ఉత్సుకతను రేకెత్తించింది. రియల్ ఇన్సిడెంట్స్ తో రూపొందించిన ఈ సినిమా రాక కోసం అంతా ఆసక్తిగా ఉన్నారు. ది వాక్సిన్ వార్ కోసం ఐకానిక్ టైమ్స్ స్క్వేర్- అమెరికాలో జరిగిన గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ ఎంతో ఆకర్షించింది. ఆకర్షణీయమైన ఫ్లాష్ మాబ్ ప్రదర్శన, వివిధ నృత్య కళా ప్రక్రియలను మిళితం చేసి ఇక్కడ ప్రదర్శించారు. ఈ అసాధారణ సంఘటన గుమిగూడిన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ ఈవెంట్ ప్రజల్ని గొప్పగా ఆకర్షించింది. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం మేకర్స్ ఇండియా లో పర్యటిస్తున్నారు.
వ్యాక్సిన్ వార్‌లో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి ప్రధాన పాత్రలు పోషించారు. భారతదేశం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథాంశం. కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు సంక్షోభ సమయంలో భారతదేశం తీసుకున్న నిర్ణయంపై కథాంశం రక్తి కట్టించనుంది. పల్లవి జోషి -ఐ యామ్ బుద్ధా నిర్మించిన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగులో 28 సెప్టెంబర్ 2023న విడుదల కానుంది.