ప్రభాస్ ని ఆ ఇద్దరు లైట్ తీసుకున్నారా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సిద్దార్ధ్ ఆనంద్ ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్రకటించిన సంగతి తెలిసిందే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సిద్దార్ధ్ ఆనంద్ ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు..హిందీలో నిర్మించడానికి సిద్దమైంది. దీంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. సిద్దార్ధ్ లాంటి యాక్షన్ మేకర్ కి ప్రభాస్ లాంటి కటౌట్ తోడైతే? యాక్షన్ నెక్స్ట్ లెవల్లోనే ఉంటుందని అంతా ఊహించారు. అలాగే సెన్షేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నట్లు అంతే బలమైన ప్రచారం సాగింది.
ఈ కాంబినేషన్ ని కూడా కలిపింది మైత్రీ సంస్థ అని తెరపైకి వచ్చింది. ఇద్దరు పాన్ ఇండియా ప్రతిభావంతులు కలిస్తే అంతకు మించి సంచలనం ఏముంటుంది? అది వండర్ అవుతుందని అలా భావిస్తున్నారు. మరి ఈ రెండు ప్రాజెక్ట్ ల తాజా పరిస్థితి ఏంటి? అంటే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం రెండు అటకెక్కిన చిత్రాలుగానే వినిపిస్తుంది. ప్రభాస్ బిజీ షెడ్యూల్ చూసి ఆ ఇద్దరు దర్శకులకు ఇప్పట్లో తనతో సినిమా సాధ్యం కాదని వెనక్కి వెళ్లిపోయారని తాజాగా వినిపిస్తుంది.
అందుకు ఛాన్స్ లేకపోలేదు. ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాలు పూర్తి చేయాలి. ఆ తర్వాత వాళ్లకు డేట్లు ఇచ్చేది. అంతవరకూ ఆయన కూడా నో ఛాన్స్ అనేయడంతో ఆ ప్రాజెక్ట్ లు రద్దయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ 'సలార్ -2' పూర్తి చేయాలి. అలాగే సెట్స్ లో ఉన్న 'రాజాసాబ్' చిత్రాన్నివీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలి. ఈ రెండు ఎప్పుడు పూర్తవుతాయన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు.
అలాగే సందీప్ రెడ్డి వంగతో 'స్పిరిట్' సినిమా కూడా పూర్తి చేయాలి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ . ఈ సినిమా కూడా షూటింగ్ వేగంగా పూర్తయ్యేది కాదు. అటుపై హను రాఘవపూడితో వరల్డ్ వార్ లవ్ స్టోరీ కూడా పూర్తి చేయాలి. ఇవన్నీ పూర్తి చేయాలంటే ఎలా లేదన్నా? మూడు నాలుగేళ్లు సమయం పడుతుంది. అప్పటి వరకూ లోకేష్..సిద్దార్ధ్ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఆ నాలుగు సినిమాలకు సంబంధించి డార్లింగ్ ఓ షెడ్యూల్ ఇచ్చేసాడు. వాటి ప్రకారం షూటింగ్ పూర్తవుతాయి. అంత వరకూ ఏ డైరెక్టర్ కి ప్రభాస్ డేట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు.