పాన్ ఇండియా సినిమా అంటే సౌత్ ఒక్క‌టే దిక్కు!

బాలీవుడ్ హీరోలంతా సౌత్ ఇండ‌స్ట్రీ వైపు ఎందుకు చూస్తున్న‌ట్లు? అంటే ఇంత‌వ‌ర‌కూ సౌత్ లో మార్కెట్ కోస‌మే ఇలా చేస్తున్నార‌నే గ‌ట్టిగా వినిపించింది.

Update: 2023-10-02 07:30 GMT

బాలీవుడ్ హీరోలంతా సౌత్ ఇండ‌స్ట్రీ వైపు ఎందుకు చూస్తున్న‌ట్లు? అంటే ఇంత‌వ‌ర‌కూ సౌత్ లో మార్కెట్ కోస‌మే ఇలా చేస్తున్నార‌నే గ‌ట్టిగా వినిపించింది. తెలుగు..త‌మిళ్..క‌న్న‌డ తో పాటు మాలీవుడ్ లోనూ త‌మ సినిమాల్ని ప్ర‌మోట్ చేసుకోవాలంటే? ఇక్క‌డి స్టార్ల మ‌ద్ద‌తు అవ‌స‌రం... ఇక్క‌డి వాళ్ల‌తో స్నేహం అవ‌స‌రం కాబ‌ట్టి ఇటుగా రౌండ్లు వేస్తున్న‌ట్లు బాగా వినిపించిన మాట‌. కానీ అస‌లి సంగ‌తి అది కాద‌ని తెలుస్తోంది.

కేవ‌లం పాన్ ఇండియాలో! త‌మ‌కి స‌క్సెస్ ఇవ్వ గ‌ల ద‌ర్శ‌కులు ఇక్క‌డ మాత్ర‌మే ఉన్నారు? అన్న‌ది తాజా మాట‌. మ‌రి బాలీవుడ్ లో అలాంటి ద‌ర్శ‌కులు లేరా? అంటే లేర‌నే చెప్పాలి. ఒక‌ప్పుడు హిందీ ప‌రిశ్ర‌మ పేరు అగ్ర‌గామిగా వినిపించేది. కానీ హిందీ సినిమాలేవి సౌత్ లో కోట్ల వ‌సూళ్లు సాధించిన చ‌రిత్ర లేదు. ఇప్ప‌టికీ ఆ ఘ‌నత ఏ హిందీ సినిమాకి కూడా లేదు. అదే సౌత్ సినిమాలు నార్త్ లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంద‌ర్భాలు ఈ మ‌ధ్య కాలంలో ఎన్నో క‌నిపిస్తున్నాయి.

అక్క‌డి ఆడియ‌న్స్ ద‌క్షిణాది సినిమాల‌కే ఏ స్థాయిలో పెద్ద పీట వేస్తున్నారో అద్దం ప‌ట్టిన‌ట్లే క‌దా. ఆ కోణంలో చూసినా ఉత్తరాది ద‌ర్శ‌కుల క‌న్నా! ద‌క్షిణాది ద‌ర్శ‌కుల‌దే అగ్ర స్థానం క‌నిపిస్తుంది. పాన్ ఇండియాలో సినిమా తీసి దాన్ని హిట్ చేయ‌గ‌ల స‌త్తా కేవ‌లం ద‌క్షిణాది మేక‌ర్ల‌కు మాత్ర‌మే సొంత‌మ‌ని ఇప్ప‌టికే చాలా సినిమాలు రుజువు చేసాయి. స‌రిగ్గా ఈ పాయింట్ ని ప‌ట్టుకునే బాలీవుడ్ హీరోలు ఇటుగా ట‌ర్న్ తీసుకుంటున్నారు.

షారుక్ ఖాన్ - అట్లీతో 'జ‌వాన్' తీయ‌డం వెనుక అస‌లు కార‌ణం అదే. అమిర్ ఖాన్..స‌ల్మాన్ ఖాన్ న‌టులు సౌత్ మేక‌ర్స్ వైపు ఆస‌క్తి చూపించ‌డానికి అదే కార‌ణం. ఇంకా ఎంతో మంది బాలీవుడ్ న‌టులు తెలుగు.. త‌మిళ సినిమాలు చేయ‌డం వెనుక స్ట్రాట‌జీ అదే. వాస్త‌వానికి ఇక్క‌డి ప్ర‌తిభ‌ని క‌ర‌ణ్ జోహ‌ర్ లాంటి వారు బాలీవుడ్ కి తీసుకెళ్లిపోవాల‌ని ముందుగానే స్కెచ్ వేసారు. కానీ అది గ‌మ‌నించిన రాజ‌మౌళి ఆ ఛాన్స్ వాళ్ల‌కి ఇవ్వ‌లేదు. తాను తీసే ఏ పాన్ ఇండియా సినిమా అయినా తెలుగు నుంచే వెళ్లాల‌ని బ‌లంగా సంక‌ల్పించి ముందుకెళ్తున్నారు. ఇంకా సుకుమార్.. ప్ర‌శాంత్ నీల్..లోకేష్ క‌న‌గ‌రాజ్ లాంటి వారు కూడా సొంత ప‌రిశ్ర‌మ‌ల నుంచి త‌మ సినిమాలు విశ్వ‌వ్యాప్తం అవ్వాల‌ని భావిస్తున్నారు.

Tags:    

Similar News