యంగెస్ట్ కార్గిల్ వీరుడు ప‌ర‌మ‌వీర‌చ‌క్ర గ్ర‌హీత‌ జీవిత‌క‌థ‌తో

భారత సైన్యంలోని అతి పిన్న వయస్కుడైన పరమవీర చక్ర గ్రహీత యోగేందర్ యాదవ్‌పై చిత్రాంగద సింగ్ సినిమా హక్కులను పొందారు. సుబేదార్ యోగేంద్ర యాదవ్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు.

Update: 2023-07-30 11:06 GMT

న‌టి చిత్రాంగ‌ద సింగ్ సొంత బ్యాన‌ర్ ని ప్రారంభించి నిర్మాత‌గా మారిన సంగ‌తి తెలిసిందే. దిల్జిత్ దోసాంజ్ - తాప్సీ ప‌న్ను తారాగ‌ణంగా భారతీయ హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ నిజమైన కథ ఆధారంగా `సూర్మ` చిత్రాన్ని తొలి ప్ర‌య‌త్నంగా నిర్మించిన చిత్రాంగద సింగ్ ఇప్పుడు అద్భుతమైన ధైర్యసాహసాలకు మారుపేరైన వీర‌సైనికుడి జీవిత‌క‌థ‌ను తెర‌కెక్కించ‌నున్నారు.

భారత సైన్యంలోని అతి పిన్న వయస్కుడైన పరమవీర చక్ర గ్రహీత యోగేందర్ యాదవ్‌పై చిత్రాంగద సింగ్ సినిమా హక్కులను పొందారు. సుబేదార్ యోగేంద్ర యాదవ్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. ఇప్పటి వరకు 19 సంవత్సరాల వయస్సులో పరమవీర చక్ర అందుకున్న అతి పిన్న వయస్కుడు. దేశంలో ఇప్పటివరకు జీవించి ఉన్న పరమవీర చక్ర గ్రహీతలలో అతను కూడా ఒకడు. అప్పటి నుండి భారత సైన్యంలో అత‌డు సేవల్ని అందిస్తున్నారు.

నిజ‌జీవిత వీరుడు యాదవ్ క‌థ‌తో సినిమాని నిర్మించే హక్కులను పొందడం గురించి చిత్రాంగద ఆనందం వ్య‌క్తం చేసారు. రియల్ హీరోలు మన మధ్యనే జీవిస్తున్నప్పటికీ ప్ర‌జ‌లు మరచిపోయిన వారి కథలను చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వారి ప్రయాణాన్ని మనం కీర్తించాలి. నేను సూర్మతో ప్రయత్నించాను. ఇది రెండో ప్ర‌య‌త్నం అని తెలిపారు. సినిమా హక్కులు దీపక్ సింగ్ సహ-యాజమాన్యమైన CS ఫిల్మ్స్ చేతిలో ఉన్నాయి. సీఎస్ ఫిలింస్ కి చిత్రాంగ‌ద అధినాయ‌కురాలు.

Tags:    

Similar News