వీడియో: రాకుమారుడు- రాకుమార్తె పెళ్లి వేడుకలా
రాజస్థాన్ ఉదయ్ పూర్ లో రెండు రోజుల పాటు సాగిన డెస్టినేషన్ వెడ్డింగ్ లో పరిణీతి- ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా ఒకటయ్యారు. బంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం కన్నులపండుగగా సాగింది.
ఇది రాకుమారుడు - రాకుమార్తె పెళ్లిలా ఉంది! నవాబ్ లు.. పటౌడీలు.. జమీందారీ వ్యవస్థలో ఘనమైన వివాహ వేడుకను తలపించింది. కొంచెం సినిమాటిగ్గా అనిపించినా కానీ, సంథింగ్ స్పెషల్ గా ఉంది. పెళ్లి కొడుకు రాక కోసం వధువు ఎంతో ఆత్రంగా వేచి చూడడం.. అతడు అల్లంత దూరాన ఉన్న ప్యాలెస్ నుంచి దీవిలోకి పడవలో బయల్దేరి వైభవంగా ప్రయాణించి రావడం..ఆపై డోలు భాజా నడుమ పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని ఒక చోటికి చేర్చి సంబరం చేయడం.. వేడుక చూస్తుంటేనే కన్నులపండుగగా ఉంది. ఇదంతా ఎవరి వివాహం గురించో చెప్పాల్సిన పని లేదు. పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా వివాహం గురించే ఇదంతా.
సినీనటితో రాజకీయ నాయకుడి స్నేహం- ప్రేమ పెళ్లి వరకూ చేరడం ఇంట్రెస్టింగ్. ఇకపైనే అసలు వ్యవహారం మొదలు కానుంది. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో రెండు రోజుల పాటు సాగిన డెస్టినేషన్ వెడ్డింగ్ లో పరిణీతి- ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా ఒకటయ్యారు. బంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం కన్నులపండుగగా సాగింది. కరోనా మహమ్మారీ టెన్షన్స్ లేకపోవడంతో ఎలాంటి ఆంక్షలు లేవు. దీంతో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత తమ స్వస్థలాల్లో ఇతర బంధుమిత్రుల కోసం భారీగా విందు వినోదాల ఏర్పాట్లలో పారీ బిజీ అయిపోయింది.
ఈ సెలబ్రిటీ పెళ్లి డీటెయిలింగ్ లోకి వెళితే.. సెప్టెంబర్ 24న పెళ్లి బాజా మోగింది. పరిణీతి చోప్రా తన మొదటి వివాహ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగానే అభిమానులు అనుచరులు ఆశ్చర్యపోయారు. పరిణీతి - రాఘవ్ చద్దా హల్దీ వేడుక నుండి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక ఈ పెళ్లిలో కొత్త జంట అదరగొట్టారు. లవ్వీ-డోవీ జంటను వీక్షించేందుకు రెండు కళ్ల చాలలేదు. కొత్త జంట ప్రజల దృష్టిని మరల్చలేకపోయారంటే అతిశయోక్తి కాదు.
పరిణీతి చోప్రా కోసం మనీష్ మల్హోత్రా వెడ్డింగ్ డ్రెస్ ని డిజైన్ చేయగా, రాఘవ్ చద్దా వివాహ దుస్తులను పవన్ సచ్‌దేవా డిజైన్ చేశారు. ఇక ఈ పెళ్లికి హాజరవుతుందనుకున్న ప్రియాంక చోప్రా రకరకాల బిజీ షెడ్యూల్స్ కారణంగా అటెండ్ కాలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. ఇక మిస్టర్ అండ్ మిసెస్ చద్దా ఢిల్లీ వెడ్డింగ్ రిసెప్షన్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. వీరిద్దరూ ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేసారని తెలిసింది.