పరిణీతి పెళ్లి జ్ఞాప‌కాలు అల‌లు అల‌లుగా

ఈ ఫోటోలు షేర్ అయిన‌ కొన్ని నిమిషాలకే పలువురు అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు. ఒక అభిమాని "ఆ వూహూ వావ్ అనిపిస్తున్నారు" అని వ్రాసాడు.

Update: 2023-11-29 08:15 GMT

ఆప్ నాయ‌కుడు రాఘవ్ చ‌ద్దాతో పారీ ప్రేమాయ‌ణం పెళ్లి వ్య‌వ‌హారం తెలిసిందే. ప‌రిణీతి చోప్రా - రాఘవ్ చద్దా ఈ సంవత్సరం సెప్టెంబర్ 24న వివాహం చేసుకున్నారు. వివాహం నుండి వీరిద్దరి ఫోటోషూట్లు, వీడియోలు వెబ్ లో వైర‌ల్ గా మారాయి. వివిధ సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఈ పెళ్లి నుంచి బ‌య‌టికి రాని చాలా ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. అవి వైర‌ల్ గా మారుతున్నాయి. ఇప్పుడు, మరోసారి పారీ తన సోషల్ మీడియాల్లో అలాంటి త్రోబ్యాక్ ఫోటోల‌ను షేర్ చేసింది. ఇవి సంగీత వేడుక నుండి మనోహరమైన ఫోటోషూట్ చిత్రాలు...


పరిణీతి చోప్రా సంగీత వేడుక నుండి అరుదైన ఫోటోల‌ను రాఘవ్ చద్దాతో షేర్ చేసారు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో అనేక ఫోటోలను షేర్ చేసింది. ఆమె ప్రత్యేకమైన రోజు కోసం అన్ని దుస్తులను ఏస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేయ‌గా, సంగీత్ నైట్ లో ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించింది.


పారి - రాఘవ్‌ల 90ల నాటి థీమ్ సంగీత్ రాత్రి సెప్టెంబర్ 23న జరిగింది. పారీ పోస్ట్‌కి ఒక అంద‌మైన‌ క్యాప్షన్ ని ఇచ్చింది. "బ్లింగ్ ఇట్ ఆన్!" అని రాసింది. ఈ గెట‌ప్ పూర్తిగా విల‌క్ష‌ణ‌మైన‌ది. వెండి-రంగు స్లీవ్‌లెస్, డీప్-నెక్ సిల్వర్ బ్లౌజ్‌ను ధరించి, దానికి సరిపోయే డిజైన‌ర్ ప్యాంటును ధ‌రించింది. దీనితో పాటు మెష్డ్ ష్రగ్‌ను కూడా ధరించింది. ఈ డ్రెస్ లో క్లిష్టమైన స్ఫటికాలు, స్టుడ్స్ భారీ అలంకారాలతో ఉపయోగించుకుంది. భారీ చోకర్ నెక్‌పీస్, బ్యాంగిల్స్, డైమండ్ స్టడ్ చెవిపోగులు, డైమండ్ రింగ్‌తో తనను తాను అలంకరించుకుని అందంగా కనిపించింది. స్మోకీ-కోహ్లెడ్ కళ్ళు - మ్యాచింగ్ లిప్ షేడ్‌తో సాంప్ర‌దాయ రూపంతో ఆక‌ట్టుకుంది.


ఈ ఫోటోలు షేర్ అయిన‌ కొన్ని నిమిషాలకే పలువురు అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు. ఒక అభిమాని "ఆ వూహూ వావ్ అనిపిస్తున్నారు" అని వ్రాసాడు. మరొక అభిమాని 'ఆ అంద‌మైన కళ్ళు' అని వ్యాఖ్యానించాడు. చాలా మంది అభిమానులు కామెంట్స్ విభాగంలో రెడ్-హార్ట్ - హార్ట్-ఐ ఎమోజీలను షేర్ చేసారు.

పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా పరిచ‌యం

పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా ఇద్దరూ తమ విహారయాత్రలలో కలిసి కనిపించిన తర్వాత డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. మే 13న న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో నిశ్చితార్థం జరిగినట్లుగా ఈ జంట అధికారికంగా ప్రకటించారు. దాదాపు నాలుగు నెలల తర్వాత, సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

Tags:    

Similar News