అమ్మతో..అత్తమ్మతో మాల్దీవులకు!
ఈ రెండు గాక అప్పుడాయన బిజీగా ఉండి వెళ్లలేకపోయారా? అన్నది మరో వార్త. ఈ నేపథ్యంలో తాజాగా పరిణీతి మరోషాక్ ఇచ్చింది.
పెళ్లైయిన కొత్తలోనే బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భర్త తో కాకుండా ప్రెండ్స్ గ్యాంగ్ తో మాల్దీవులకు వెళ్లడంతోనే ఈ షాక్. కొత్తగా పెళ్లైన ఎవరైనా జోడీగా వెళ్తారు ఇలా స్నేహితుల్ని వెంటేసుకుని వెళ్లిందేంటి? అని అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఏ పోస్ట్ లోనూ భర్త రాఘవ్ చద్దా కనిపించలేదు. దీంతో ఆయన యాక్టివ్ ఎంపీ కావడంతో వెకేషన్ కి వెళ్లలేదా? లేక వెకేషన్ గట్రా ఇష్టం లేక వెళ్లలేదా? అన్నపెద్ద చర్చ సాగింది.
ఈ రెండు గాక అప్పుడాయన బిజీగా ఉండి వెళ్లలేకపోయారా? అన్నది మరో వార్త. ఈ నేపథ్యంలో తాజాగా పరిణీతి మరోషాక్ ఇచ్చింది. ఈసారి ప్రెండ్స్ గ్యాంగ్ ని వదిలేసి ఫ్యామిలీ గ్యాంగ్ తో అదే స్పాట్ కి వెళ్లింది. ఇప్పటివరకూ మాల్దీవుల నుంచి కేవలం పరిణితి సోలో ఫోటోలే లీక్ అయ్యాయి. తాజాగా పరిణితితో పాటు అత్త..అమ్మ కూడా వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈసారి స్నేహితులతో పాటు పరిణితి కుటుంబ సభ్యులు కూడా ప్రేమ్ లో కనిపిస్తున్నారు.
ఇదిగో ఇక్కడిలో బీచ్ లో అమ్మడు ఆంటీతో..మమ్మీతో కలిసి ఫోటోలు దిగింది. వాళ్లు కూడా అంతే మోడ్రన్ గా కనిపిస్తున్నారు. అంతా క్యాజువల్స్ లో దర్శనమిచ్చారు. ఎండ వేడిని తట్టుకునేలా కళ్లకు గ్లాసెస్ ధరించి ఇసుకలో వాక్ చేస్తున్నారు. ఈసారి కూడా హబ్బీ పిక్ లో కనిపించలేదు. పరిణితి ఇంతకు ముందు పోస్ట్ చేసిన ఫోటోల్లో కూడా ఎక్కడా రాఘవ్ చద్దా లేడు. దీంతో ఈసారి భర్త వెకేషన్ కి రానట్లే తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరిణితి ఫ్యామిలీ తో వచ్చినా? హబ్బీ ఎక్కడ అంటూ ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. మొత్తానికి పరిణితి డిఫరెంట్ యాంగిల్ కొందర్ని ఆకర్షిస్తుంది. ఈ రకమైన ట్రిప్ కూడా థ్రిల్ ఫీలవుతుంది. భర్త బోరింగ్..ఫ్యామిలీ ఇంట్రెస్టింగ్ అంటూ ఓ అభిమాని కామెంట్ చేసాడు