ఆ స్టార్ హీరో క‌జిన్ అప్పుడే డ‌ర్టీ రోల్!

ఆ పాత్ర చాలా డ‌ర్టీగా ఉంటుందిట‌. శృంగారం కోసం హీరో వెంట ప‌డే భామ‌గా క‌నిపించ‌నుందిట‌.

Update: 2023-09-18 14:30 GMT

బాలీవుడ్ లో రోష‌న్ బ్ర‌ద‌ర్స్ ఎంతటి పేరు ప్ర‌ఖ్యాత‌లు క‌లిగి ఉన్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. గొప్ప ద‌ర్శ‌కుడిగా రాకేష్ రోష‌న్...గొప్ప సంగీత ద‌ర్శ‌కుడిగా రాజేష్ రోష‌న్ బాలీవుడ్ ని ఏల్తున్నారు. ఆ కుటుంబం నుంచి వ‌చ్చిన హృతిక్ రోష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో ఎంత‌మంది హీరోలున్నా! హృతిక్ ప్ర‌త్యేక‌మైన న‌టుడు. త‌న‌కంటూ స‌ప‌రేట్ ఐడెంటిని సంపాదించుకున్న హీరో. వాళ్ల త‌ర్వాత ఆ కుటుంబం నుంచి బాలీవుడ్ లో పెద్ద‌గా ఎవ‌రూ క‌నిపించ‌లేదు.

అయితే చాలా కాలానికి రాజేష్ రోష‌న్ కుమార్తె ప‌ష్మీనా రోష‌న్ మాత్రం మ్యాక‌ప్ వేసుకుంటుంది. 'ఇష్క్ విష్క్' సీక్వెల్ గా తెర‌కెక్కిస్తున్న 'ఇష్క్ విష్క్ రీబౌండ్' తో లాంచ్ అవుతుంది. ఇందులో రోహిత్ స‌రాఫ్ కి జంట‌గా న‌టిస్తోంది. కాగా ప‌ష్మీనా రోష‌న్ రెండ‌వ ప్రాజెక్ట్ మాత్రం సంచ‌ల‌న పాత్ర‌తోనే ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌బోతుంది. టైగ‌ర్ ష్రాప్..సారా అలీఖాన్ జంట‌గా 'హీరో నెంబ‌ర్ వ‌న్' అనే చిత్రం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

జ‌గ‌న్ శ‌క్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇదే చిత్రంలో ప‌ష్మీనా సెకెండ్ లీడ్ కి ఎంపికైంది. ఇందులో అమ్మ‌డు సంచ‌ల‌న పాత్ర‌లో క‌నిపించ‌నుందిట‌. ఆ పాత్ర చాలా డ‌ర్టీగా ఉంటుందిట‌. శృంగారం కోసం హీరో వెంట ప‌డే భామ‌గా క‌నిపించ‌నుందిట‌.

హీరో మ‌న‌సు తెలిసిన అమ్మ‌డు అటుపై ప్రేమని మించింది శృంగారం అనే డ‌ర్టీ రోల్ పోషిస్తుందిట‌. ఈ పాత్ర స‌హా..ప‌ష్మీనా కాస్ట్యూమ్స్ ప్ర‌తీది అమ్మ‌డిని మ‌రింత నాటీగా ఎలివేట్ చేయ‌బోతుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి.

వాస్త‌వానికి ఈ పాత్ర కోసం తొలుత ఓ పేరున్న హీరోయిన్ తీసుకోవాల‌నుకున్నారుట‌. కానీ ఆమె నిరాక‌రించ‌డంతో ప‌ష్మినాని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. ప‌ష్మీనా రోష‌న్ ఈ అవ‌కాశం గొప్ప గా భావించి క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. అమ్మ‌డు జ‌ర్నీ ఇప్పుడే మొద‌లైంది. కానీ న‌టిగా త‌న‌కంటూ ఎలాంటి ప‌రిమితులు లేవ‌ని తాజా క‌మిట్ మెంట్ ని బ‌ట్టి తెలుస్తోంది. మ‌రి రోష‌న్ డాట‌ర్ తెర‌పై ఎంత అందంగా మెప్పిస్తుందో? చూడాలి.

Tags:    

Similar News