అంబానీల పెళ్లికి పటౌడీ జంట రాయల్ టచ్
కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్ డేవన్ లో రాయల్ టచ్ జోడించారు. సైఫ్ -కరీనాల పెద్ద కుమారుడు తైమూర్ వారితో పాటు గాలా ఈవెంట్ లో సందడి చేయడం కనిపించింది.
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ను వివాహం చేసుకోబోతున్నారు. గుజరాత్ జామ్ నగర్ లో మూడు రోజుల వివాహానికి ముందు జరిగిన ఉత్సవాల్లో 1వ రోజు (శుక్రవారం) అతిథులు మెరుపులు మెరిపించారు. ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మరియు రణబీర్ కపూర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అక్షయ్ కుమార్ - అజయ్ దేవగన్ నలుపు రంగులో కవల సోదరుల్లా కనిపించారు. ఇదే వేడుకలో టాలీవుడ్ నుంచి రామ్ చరణ్- ఎన్టీఆర్ ప్రత్యేక అతిథులుగా మెరిసారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
ఈ వేడుకకు పటౌడీ సంస్థాన కోడలు కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్ డేవన్ లో రాయల్ టచ్ జోడించారు. సైఫ్ -కరీనాల పెద్ద కుమారుడు తైమూర్ వారితో పాటు గాలా ఈవెంట్ లో సందడి చేయడం కనిపించింది. కరీనా డిజైనర్ మావ్ చీరను ధరించగా, స్లీవ్‌లెస్ కార్సెట్-స్టైల్ మ్యాచింగ్ బ్లౌజ్‌తో అందంగా కనిపించింది.
డైమండ్ చోకర్ .. చంకీ స్టేట్‌మెంట్ చెవిపోగులు ధరించింది. మరోవైపు సైఫ్ చారల డిజైన్ నలుపు సూట్‌లో డాపర్‌గా కనిపించాడు. మ్యాచింగ్ ప్యాంటు, పర్పుల్ షర్ట్-పింక్ పాకెట్ స్క్వేర్ అదనపుఆకర్షణ. తైమూర్ కూడా తండ్రిలా బ్లాక్ టక్సేడో సెట్‌లో చాలా అందంగా కనిపించాడు.
పటౌడీ కుటుంబంతో పాటు, అక్షయ్ కుమార్ , అజయ్ దేవగన్ ప్రత్యేక డ్రెస్ సెన్స్ తో కనిపించారు. అజయ్ దేవ్‌గన్ అతడి మేనల్లుడు ఆమన్ దేవగన్‌తో కలిసి సందడి చేసారు. దేవగన్ కుమార్తె కూడా ఈ వేడుకలో మెరుపులు మెరిపించింది. పాప్ సంచలనం రిహన్నా ప్రదర్శన నుండి ప్రత్యేక డ్రోన్ షో వరకు ప్రతిదీ హైలైట్ గా నిలిచాయి. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు.. MS ధోనీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖ క్రీడా ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు విలాసవంతమైన వేడుకలకు హాజరయ్యారు.
రిలయన్స్ అధినాయకురాలు నీతా అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లి గురించి మాట్లాడుతూ తమ మూలాలను తలచుకున్నారు. "నా చిన్న కొడుకు అనంత్ -రాధిక పెళ్లికి వచ్చినప్పుడు నాకు రెండు ముఖ్యమైన కోరికలు ఉన్నాయి. మొదట నేను మా మూలాలకు వెళ్లి సెలబ్రేషన్ జరుపుకోవాలని కోరుకున్నాం...జామ్‌నగర్‌కు మనందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది . దానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. గుజరాత్ అనుబంధం గొప్పది. మేము ఎక్కడ నుండి వచ్చాము. ఇక్కడే ముఖేష్ అతడి తండ్రి రిఫైనరీని నిర్మించారు. నేను ఈ ఎడారి వంటి ప్రాంతాన్ని పచ్చని టౌన్‌షిప్ .. శక్తివంతమైన కమ్యూనిటీగా మార్చడం ద్వారా నా వృత్తిని ప్రారంభించాను" అని నీతాజీ తెలిపారు.