వేదళం రీమేక్.. పవన్ అప్పుడే ఇలా..
దీంతో, పవన్ చేయాల్సిన సినిమా ఇప్పుడు చిరు చేతికి వచ్చింది అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం బోళా శంకర్. ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకకు రానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా, అది ఆకట్టుకుంటోంది. అయితే, ఈ మూవీ వేదాళం రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. రీమేక్ మూవీ కదా అని చాలా మందిలో కొంత భయం అయితే ఉంది. అయితే, డైరెక్టర్ మెహర్ రమేష్ రీమేక్ ఛాయలు కనపడకుండా జాగ్రత్త పడ్డాడని, అసలు రీమేక్ మూవీ చూశామనే భావన కూడా కలగదు అని మూవీ టీమ్ చెబుతోంది.
ఆ విషయం టీమ్ చెప్పడం కాదు, మూవీ చూసిన తర్వాత ప్రేక్షకులే చెబుతారు. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ మూవీ గురించి తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ మూవీని మొదట పవన్ రీమేక్ చేయాలని అనుకున్నాడట. అనుకోవడమే కాదు, ఏకంగా మూవీని మొదలుపెట్టారట కూడా. అయితే, ఏవో కారణాల వల్ల ఈ మూవీ పట్టాలెక్కలేదు.
అయితే, అప్పుడు మూవీని మొదలుపెట్టినప్పుడు పూజా కార్యక్రమాలు చేయగా, దాని ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో, పవన్ చేయాల్సిన సినిమా ఇప్పుడు చిరు చేతికి వచ్చింది అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాని తమిళ దర్శకుడు ఆర్టీ నీసన్ 2016లో పవన్ తో ఈ సినిమా తీయాలని అనుకున్నారు. కానీ నిర్మాత ఏఎం రత్నం కి ఏవో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో, అప్పట్లో ఈ మూవీ పూజ దగ్గరే ఆగిపోయింది.
పవన్ అప్పుడు మొదలుపెట్టగా, ఇప్పుడు చిరు దానిని పూర్తి చేసి, విడుదలకు రెడీ అవ్వడం విశేషం. ఇదిలా ఉండగా, బోళా శంకర్ ఆగస్టు 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తోంది. ఇక కీర్తి సురేష్ ది ఈ మూవీలో చాలా కీలక పాత్ర. ఆమె చిరు కి చెల్లెలిగా కనపడనుంది.
అసలు ఈ సినిమాకి అన్న, చెల్లెలి అనుబంధమే అసలు కీ పాయింట్. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు విపరీతంగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. మరి, ఈ రీమేక్ చిత్రంతో మెహర్ రమేష్ అందరినీ ఎలా మెప్పిస్తాడో చూడాలి.