పిక్ టాక్ : మరో గుడ్ న్యూస్ చెప్పిన పవన్

అటు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సాబ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. ఇటు ఖాళీ దొరికినప్పుడల్లా తన చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు

Update: 2024-12-03 04:15 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సాబ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. ఇటు ఖాళీ దొరికినప్పుడల్లా తన చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ అనేక కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మంగళగిరి సమీపంలో వేసిన బిగ్ సెట్ లో ప్రస్తుతం చిత్రీకరణ చేస్తున్నారు మేకర్స్. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

సోమవారం మధ్యాహ్నం నుంచి పవన్ షూటింగ్ లో పాల్గొంటారని వార్తలు రాగా.. ఆయనే క్రేజీ అప్డేట్ ఇచ్చారు. వీరమల్లు మూవీ సెట్స్ లో దిగిన సెల్ఫీని నిన్న రాత్రి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. బిజీ రాజకీయ షెడ్యూల్ తర్వాత చాలా కాలం పాటు పెండింగ్‌ లో ఉన్న వర్క్ కోసం తన సమయాన్ని కొన్ని గంటలపాటు కేటాయించానంటూ రాసుకొచ్చారు.

కింద హరిహర వీరమల్లు ట్యాగ్ ను ఇచ్చారు పవన్. పిక్ లో పవన్ రోల్ గెటప్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. సినిమాలో ఆయన బందిపోటుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పోస్ట్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు, అభిమానులు.. పవన్ పెట్టిన స్టోరీని తమ సోషల్ మీడియా వాల్స్ లో తెగ షేర్ చేస్తున్నారు.

మూవీ సెట్స్ లో తీసుకున్న సెల్ఫీని పవన్ పోస్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందని అభిమానులు చెబుతున్నారు. అటు డిప్యూటీగా, మంత్రిగా విధులు నిర్వరిస్తూ.. ఇటు సినిమాలు కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదని అంటున్నారు. అర్థరాత్రి వరకు షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుండడంతో ఆయన ఓపికను అభినందిస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఆ ప్రాజెక్ట్ ను జ్యోతి కృష్ణ ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News