పవన్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్నారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాతగా ఓసినిమా చేయాల్సిన సంగతి తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాతగా ఓసినిమా చేయాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఆ ప్రాజెక్ట్ ని తాత్కాలికంగా పక్కనబెట్టినట్లు రామ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పట్లో సినిమా చేయడం లేదని..ఆయన డేట్లు ఇచ్చినప్పుడు చేస్తామని తెలిపారు. అయితే ఇది కిక్, రేసుగుర్రం తరహా ఎంటర్ టైనర్ అని కూడా రివీల్ చేసారు.
అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ లో పవన్ ప్లేస్ లోకి మరో హీరో వస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
ఓ సీనియర్ హీరోతో ఆప్రాజెక్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారుట. ఇంతకీ ఎవరా హీరో అంటే? విక్టరీ వెంకటేష్ అని వినిపిస్తుంది. సురేందర్ రెడ్డి- నిర్మాతలు వెంకీని కలిసి చర్చించినట్లు సమాచారం. ఆయన కూడా ఎంటర్ టైనింగ్ స్టోరీ కావడంతో ఒకే చెప్పినట్లు చిత్ర వర్గాల సమాచారం.
వచ్చే ఏడాదే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నారుట. ఇదే నిజమైతే దర్శక-నిర్మాతలకు సమయం వృద్దా కాకుండా ఉంటుంది. పవన్ తో పెట్టుకుంటే సినిమా ఆలస్యం తప్పదు. ఇప్పటికే ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు మూడు రెడీగా ఉన్నాయి. `హరిహరవీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్ భగత్ సింగ్` లను పూర్తి చేసి రిలీజ్ చేసేలోపు 2026 ముగస్తుంది.
అలా చూసుకుంటే పవన్ తో సురేందర్ రెడ్డి సినిమా చేయాలంటే? అప్పటివరకూ వెయిట్ చేయాలి. వెయిట్ చేసినా గ్యారెంటీ లేదు. పవన్ ఏపీ రాజకీయాల్లోనూ బిజీ. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు వహిస్తున్నారు. పైగా 2027లో జమిలి ఎన్నికలు అంటున్నారు. అలాంటప్పుడు పవన్ సినిమాలకు సమయం కేటాయించే పరిస్థితి అస్సలుండదు. మేకర్స్ ఇవన్నీ ఆలోచించుకునే అలాంటి ప్రకటన చేసి ఉండొచ్చని వినిపిస్తుంది.