ఓజీ… రేంజ్ పెరిగిపోతోంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Update: 2024-12-14 15:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకి సంబందించిన 30 శాతం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే హైయెస్ట్ ఎక్స్ పెటేషన్స్ ఈ సినిమాపైన ఉన్నాయి. అయితే పవన్ రాజకీయ కార్యకలాపాల కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.

మరల రీసెంట్ గా సుజిత్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ‘హరిహరవీరమల్లు’ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. దీని తర్వాత ఓజీ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారు. ఆ లోపు పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు పూర్తి చేయడంపై సుజిత్ ఫోకస్ చేశారు. ఈ సినిమా కోసం జపాన్, థాయ్ లాండ్ కి చెందిన స్టార్ యాక్టర్స్ ని ఎంపిక చేశారు.

ప్రస్తుతం ఈ మూవీలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలని థాయ్ లాండ్ లో షూట్ చేస్తున్నారంట. వీటిలో ఆ యాక్టర్స్ కూడా పాల్గొన్నారు. హాలీవుడ్ యాంకర్స్ ని ‘ఓజీ’ కోసం ఎంపిక చేయడంతో సినిమా రేంజ్ మరింత పెరిగిపోయిందని చెప్పొచ్చు. థాయ్ లాండ్ షెడ్యూల్ తర్వాత ముంబై బ్యాక్ డ్రాప్ లో కొన్ని పవర్ ఫుల్ సన్నివేశాలు తెరకెక్కించబోతున్నాడంట. సుజిత్ ఈ సినిమా కోసం నెవ్వర్ బిఫోర్ అనేలా హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ ఘట్టాలు సిద్ధం చేసాడంట.

అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరు చూడని కొత్త కోణాన్ని సుజిత్ ‘ఓజీ’లో ఆవిష్కరించబోతున్నాడు. అందుకే ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ మూవీలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది. అతనిని ఒక నాయకుడిగా అభిమానించేవారు సంఖ్య ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ‘ఓజీ’ సినిమాకి ఆ ఫాలోయింగ్ చాలా ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీని ప్రతిబింబించే విధంగా ఈ సినిమాలోని కథ కూడా ఉండబోతోందని అనుకుంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిన అద్భుతాలు సృష్టించడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News