ప్రొడ్యూసర్స్ రాక్..ఫ్యాన్స్ షాక్!
మరి అక్కడ ఎంత షూటింగ్ పూర్తయిందన్నది తెలియదు. కానీ ఏది అనుకున్న విధంగా జరుగుతున్నట్లు కనిపించలేదని అంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'ఓజీ' 2025లో కూడా రిలీజ్ కష్టమేనా? అభిమానుల ఆశలపై నిర్మాతలు నీళ్లు జల్లేశారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ కడప పర్యటనకు వెళ్లిన సందర్భంలో 'ఓజీ ఓజీ' అంటూ అభిమానులు అరవడంతో? పవన కళ్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడేం మాట్లాడాలతో తెలియదంటూ అసహనం వ్యక్తం చేసారు.
ఆ తర్వాత వెంటనే ఆ చిత్ర నిర్మాతలు లైన్ లోకి వచ్చి ఆయన్ని ఇబ్బంది పెట్టకండని అభిమానులకు ఓ సూచన జారీ చేసారు. ఇదే ఏడాది ఓజీ సినిమా రిలీజ్ అవుతుందని తాము కూడా ఆశిస్తున్నాని పేర్కొన్నారు. ఇప్పుడీ ప్రకటన తోనే అభిమానులు ఒక్కసారిగా నీరసించిపోయారు. వాళ్లే కాదు నిర్మాతలు కూడా షాక్ అయ్య ఉంటారు. ఇక అభిమానుల వెర్షన్ చూస్తే ఈ ఏడాది కూడా సినిమా రిలీజ్ కష్టమనే మాట అభిమానుల్లోకి వెళ్లిపోతుంది.
వాస్తవానికి 'ఓజీ' షూటింగ్ జనవరి నెలఖరు కల్లా పూర్తి చేయాలన్నది దర్శక, నిర్మాతల ప్లాన్. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ మలేషియా షెడ్యూల్ కి కూడా హాజరయ్యారు. మరి అక్కడ ఎంత షూటింగ్ పూర్తయిందన్నది తెలియదు. కానీ ఏది అనుకున్న విధంగా జరుగుతున్నట్లు కనిపించలేదని అంటున్నారు. అటు 'హరి హరవీరమల్లు' షూటింగ్ పూర్తవ్వలేదు. ఇటు ఓజీ పూర్తి కానట్లే కనిపిస్తుంది. 2025లోకి అడుగు పెట్టడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది.
'ఓజీ' ,' వీరమల్లు' నుంచి కొత్త ఏడాది సందర్భంగానైనా అప్ డేట్ ఏదైనా వస్తుందా? అని అభిమానులు ఆశించారు. కానీ ఆ సన్నివేశం ఎక్కడా కనిపించలేదు. వీరమల్లు సంగతి పక్కనబెడితే 'ఓజీ' 2025లో రిలీజ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది. పవన్ పోర్షన్ చిత్రీకరణ ముగించాలి. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలి. పైగా ఇది భారీ యక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం పట్టే అవకాశం ఉంది. మరి వీటన్నింటి నడుమ 'ఓజీ' ఏమవుతుందో చూడాలి.